లంచాలు.. జనం మెచ్చేలా జగన్ నిర్ణయం?

ప్రభుత్వ ఆఫీసుకు వెళ్తే పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందే.. లేదంటే ఏదో ఒక సాకుతో పని ఆలస్యం అవుతుంది.. ఈ పరిస్థితిని మార్చేందుకు జగన్ ప్రభుత్వం ఏసీబీని పటిష్టం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ ఏసీబీకి సంబంధించిన కాల్ సర్వీసు సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేసారు.

ఈ కాల్ సర్వీసుపై అవగాహన కోసం.. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కార్యాలయం వరకూ 14400 కాల్ సర్వీకు చెందిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయబోతున్నారు.  3 X 5 అడుగుల సైజుతో ఏర్పాటు చేయాల్సిందిగా సీఎస్‌  సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిని ప్రభుత్వం దృష్టికి తెచ్చే విధంగా యాప్  కూడా రూపోందించామని దీనికి కూడా విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ  ఆదేశించారు.

చేయి చేయి కలుపుదాం అవినీతి భూతాన్ని తరిమివేద్దాం-లంచం ఇవ్వడం,తీసుకోవడం నేరం అనే నినాదంతో ఎసిబి రూపొందించిన ఈ 14400 యాప్ పై ప్రజలందరికీ విస్తృతంగా తెలిసే విధంగా ప్రచారం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ  ఆదేశించారు. అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులు, శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ  చేశారు.  గ్రామ స్థాయిలోని అన్ని గ్రామ పంచాయితీలు,గ్రామ సచివాలయాలు, మండల స్థాయిలో తహసిల్దార్, ఎండిఓ, సబ్ రిజిష్ట్రార్ తదితర కార్యాలాయాలు, డివిజన్ స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను వీటిని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.
అయితే బోర్డులు పెట్టడంతో పని పూర్తయిపోదు.. తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నారని జనం నమ్మితేనే ఈ బోర్డులకు విలువ. అవినీతిని అరికట్టడం అంత సులభం కాకపోయినా..ఇలాంటి చర్యలతో కొంతైనా అవగాహన వస్తుంది. ప్రజల్లో చైతన్యం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: