13న వాళ్ల ఖాతాల్లో డబ్బులు వేయనున్న జగన్‌?

జగన్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభవార్త తెలిపింది. ఈనెల 13న వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్ ల ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి 10వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ పి.రాజబాబు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ నెల 13 న సీఎం వై.ఎస్.జగన్ చేతుల మీదుగా లబ్దిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు.

వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్ నెస్, మరమ్మత్తుల కోసం ఈ సాయం అందిస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ పి.రాజబాబు తెలిపారు. ఈ పథకం కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7 వరకు సమీప గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ వాహన మిత్ర పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తారని రవాణా శాఖ కమిషనర్ పి.రాజబాబు తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ 6 అంచెల్లో పారదర్శకంగా జరుగుతుంది.

దరఖాస్తుదారు తనకు సంబంధించిన భూమి, ఆస్థి వివరాలు, ఆస్థి పన్ను వివరాలు తెలపాల్సి ఉంటుందని రవాణా శాఖ కమిషనర్ పి.రాజబాబు తెలిపారు. అలాగే విద్యుత్ వినియోగం, ఆదాయపన్ను, కులానికి సంబంధించిన వివరాలు తెలియపరచాల్సి ఉంటుందని రవాణా శాఖ కమిషనర్ పి.రాజబాబు వెల్లడించారు. వాహన యజమాని హక్కులు మార్పు చేసిన వారిని ఈ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారు.

ఇప్పటికే వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఆర్థిక సాయం పొందుతున్నవారు.. తమ వాహనంతో ఫోటో దిగి గ్రామ సచివాలయం ద్వారా అప్ లోడ్ చేయాలి. దరఖాస్తుదారునికి సొంత వాహనంతో పాటు సంబంధిత రికార్డులు, లైసెన్స్ ఉండాలి. ఒక కుటుంబానికి ఒక వాహనానికి  మాత్రమే ఆర్థిక సహాయం అందిస్తారు. వాహనదారులు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. విద్యుత్ వినియోగం 6 నెలల సగటు మీద నెలసరి 300 యూనిట్లు దాటితే పథకానికి అనర్హులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: