బీ కేర్‌ఫుల్‌: ఆ వార్నింగ్‌ జగన్‌ సర్కారుకేనా?

ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా ప్రజాకర్షక పథకాలు కొనసాగిస్తోంది. అయితే ఇటీవల ప్రధానితో జరిగిన సమావేశంలో కొందరు కేంద్ర అధికారులు ఓ రాష్ట్రం గురించి ప్రస్తావించారట. ఇద్దరు కార్యదర్శులు కొన్ని రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరును ప్రధాని దృష్టికి తీసుకొచ్చారట.  తాజాగా ఆర్థికంగా కుదేలైన ఓ రాష్ట్రంలో ప్రకటించిన ప్రజాకర్షక పథకాల గురించి ప్రధానికి వివరించారట. ఇప్పుడు ఆ రాష్ట్రం అనుసరించిన మార్గాన్నే మరికొన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయని చెప్పారట.

ఇలాంటి రాష్ట్రాలు ఆర్థికంగా అమలు చేయడం కష్టమని తెలిసినా.. ప్రజలను మోస పుచ్చుతున్నాయని సదరు కార్యదర్శులు అన్నారట. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ బాటలోనే కొనసాగితే ఆ రాష్ట్రాలు శ్రీలంక మారిదిగా తయారవుతాయని.. అక్కడ కూడా శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం తలెత్తేప్రమాదం ఉందని ఆ సెక్రెటరీలు వార్నింగ్ ఇచ్చారట. ఇదీ ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనం. అయితే.. ఈ కథనంలో తెలివిగా ఆ రాష్ట్రం పేరోంటో చెప్పలేదు. కానీ ఈ కథనం ప్రముఖంగా మొదటి పేజీలో ఇవ్వడంతో ఆ రాష్ట్రం ఏపీ అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

బహుసా అలా అనుకోవాలనే ఆ కథనం రాశారేమో తెలియదు.. ఇప్పటికే ఏపీలోని కొన్ని పార్టీలు ఏపీ త్వరలో శ్రీలంక అవుతుందంటూ విమర్శిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కథనంలోనూ అదే తరహా ప్రస్తావన ఉంది. అప్పుచేసి.. పప్పుకూడు తగదని ఆ అధికారులు చెప్పినట్టుగా ఉంది. శ్రీలంక మార్గంలో కొన్ని రాష్ట్రాలు ప్రయాణిస్తున్నాయని.. రుణాలు తెచ్చిమరీ ప్రజాకర్షక పథకాలు చేపడుతున్నాయని.. ఇలాగైతే ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుందని వార్నింగ్ ఇవ్వడం జగన్ కోసమేనా అన్న చర్చ జరుగుతోంది.

దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం లేదంటూ ఆ అధికారులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏపీ గురించేనని ఆ కథనంలో చెప్పకపోయినా జనం అర్థం చేసుకుంటారని వదిలేశారేమో అనిపిస్తోంది. లేకుంటే.. ఏదో పులిహోర కలిపేసి జగన్‌ సర్కారును ఇబ్బంది పెట్టేలా కథనం రాశారేమో అని కూడా అనిపిస్తోంది. ఏదైనా ఇది జగన్‌కు సంకట పరిస్థితే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: