ఆ వైసీపీ కీల‌క నేత‌కు జ‌గ‌న్ క్లాస్ ... ఇంత అస‌మ‌ర్థంగానా..!

VUYYURU SUBHASH
అనంత‌పురం జిల్లా హిందూపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఎత్తున వైసీపీపై వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఇక్క‌డి ప్ర‌జ‌లు జోరుగా.. వ్య‌తిరేకంగా ఉన్నారు. దీనికి కార‌ణం.. జిల్లాల ఏర్పాటు విష‌యంలో త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని.. ప్ర‌జ‌లు చెబుతున్నారు. వాస్త‌వానికి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాన‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసింది. దీనిని బ‌ట్టి హిందూపురం పార్ల‌మెంటును జిల్లా చేయాలి. అదేస‌మ‌యంలో అన్ని హంగులూ ఉన్న హిందూపురం ప్రాంతాన్నే.. ఈ జిల్లాకు కేంద్రంగా ప్ర‌క‌టించాలి. కానీ... ప్ర‌భుత్వం మాత్రం ఈవిష‌యాన్ని ప‌క్క‌న పెట్టింది.
హిందూపురం పార్ల‌మెంటులోని.. పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాన్ని.. జిల్లా కేంద్రంగా చేస్తూ.. స‌త్య‌సాయి జిల్లాను ప్ర‌క‌టించింది. దీనిపైనే ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. దీనికి టీడీపీ నాయ‌కుడు.. హిందూపురం ఎమ్మెల్యే.. బాల‌య్య కూడా కొన్నాళ్ల కింద‌ట ఆందోళ‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. రోడ్డెక్కి నిర‌స‌న కూడా వ్య‌క్తం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం మాత్రం ఈ విష‌యంలో.. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీంతో వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ కేసు హైకోర్టు వ‌ర‌కు వ‌చ్చింది. దీనిపై హైకోర్టు నిర్ణ‌యం ప్ర‌క‌టించాల్సి ఉంది.
అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. వైసీపీ నాయ‌కులు  ఏం చేస్తున్నార‌నేది .. అధిష్టానం ముందుకు వ‌చ్చిన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్న‌ప్పుడు.. ప్ర‌జ‌ల‌కు స‌ర్ది చెప్పి.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌.. పార్టీతో మాట్లాడే ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకువ‌స్తే.. ఆగ్ర‌హం దానంత‌ట అదే త‌గ్గుతుంది. వాస్త‌వానికి దీనిక‌న్నా ఎక్కువ‌గా.. క‌డ‌ప‌లోని రాయ‌చోటి వ‌ద్ద‌ని రాజంపేట కావాల‌ని.. పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అయింది.ఈ క్ర‌మంలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యేలు.... ప‌రిష్కారం కోసం.. సీఎంను క‌లిశారు.
మ‌రి ఈ త‌ర‌హాలో హిందూపురం ఎంపీ.. ఏం చేస్తున్న‌ట్టు.. ప్ర‌జ‌ల‌కు చెప్పుకోలేని..వారిని స‌మ‌ర్ధించుకోలేని ప‌రిస్థితిలో ఉన్నారా? అనేది ప్ర‌శ్న‌. ఇదే విష‌యంపై..సీఎం జ‌గ‌న్ కూడా ఆరా తీసిన‌ట్టు తెలుస్తోంది. ఇంత జ‌రుగుతుంటే.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేశారా?  లేదా?  అస‌లు ఈ విష‌యం హైకోర్టు వ‌ర‌కు ఎందుకు వ‌చ్చింది ? అని జ‌గ‌న్ ఆరాతీస్తున్నార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎంపీకి క్లాస్ ఇస్తార‌ని కూడా అంటున్నారు. మ‌రి దీనికి ఎంపీ ఏం చెబుతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: