ఆ వైసీపీ మంత్రి కొడుకు గెలుస్తాడా... తండ్రి కోరిక తీరుస్తాడా ?

VUYYURU SUBHASH
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు.. ప్ర‌స్తుతం వైసీపీలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ధ‌ర్మాన సోద‌రులు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై క్లారిటీతో ఉన్నారు. ధ‌ర్మాన సోద‌రుల్లో కృష్ణ‌దాస్‌.. మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్ర‌సాద‌రావు.. మాత్రం వ్యూహ‌త్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎం కాక‌పోతే.. అంటూ.. కృష్ణ‌దాస్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు పార్టీలోనే కాకుండా.. జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు దారితీసాయి. జ‌గ‌న్ సీఎం కాక‌పోతే.. త‌మ కుటుంబం మొత్తం రాజ‌కీయాల నుంచి విర‌మించుకుని.. స‌న్యాసం తీసుకుంటామ‌ని.. కృష్ణ‌దాస్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని కూడా చెప్పారు. ఇక‌, ప్ర‌సాద‌రావు. కూడా ఇదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత‌.. ఇద్ద‌రు నాయ‌కులు.. కూడా జిల్లాలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచి ఇంత ధీమా వ్య‌క్తం చేస్తున్న అంశంపైనే మేధావులు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది. ఈ స‌మ‌యంలో పార్టీ ప‌రంగా అభివృద్ది చేయాలి.. అదేవిధంగా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రంగానూ ముందుకు సాగాలి.
మ‌రీ ముఖ్యంగా పార్టీని శ్రీకాకుళంలో గెలిపిచాలని అంటే.. గ‌త ఎన్నిక‌ల‌స‌మ‌యంలో ఏం జ‌రిగిందో ధ‌ర్మాన ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూడాల‌ని కూడా అంటున్నారు. అప్ప‌ట్లో ధ‌ర్మాన త‌ర‌పున విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఇద్ద‌రూ కూడా ప్ర‌చారం చేశారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌చారం ఒక్క‌టే మిగులుతుంది. పైగా.. ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ నుంచి విరమించుకుంటాన‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. సో.. ఆయ‌న స్థానంలో కుమారుడికి అవ‌కాశం ఇప్పిస్తారు. మ‌రి ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కుతారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.
ఇవ‌న్నీ ఇలా ఉంటే.. చాప‌కింద నీరులా.. టీడీపీ బ‌ల‌ప‌డుతోంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టీడీపీ పరుగులు పెట్టేలా.. ఒక‌వైపు అచ్చెన్నాయుడు.. మ‌రోవైపు.. ఎంపీ రామ్మోహ‌న్ నాయుడుల‌కు చంద్ర‌బాబు ప‌గ్గాలు అప్ప‌గించారు. భారీ వ్య‌తిరేక వేవ్‌లో కూడా వీరు విజ‌యం ద‌క్కించుకున్నారు. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గ‌ట్టెక్కించేందుకు వీరు మ‌రింత శ్ర‌మ‌ప‌డ‌డం ఖాయం. మ‌రోవైపు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉండ‌నే ఉంది. ఇవ‌న్నీ ఉంచుకుని కూడా.. ధ‌ర్మాన ఇలా ఏధైర్యంగా స‌వాళ్లు రువ్వుతున్నార‌నేది మేదావుల ప్ర‌శ్న‌. మ‌రి ఆయ‌న ధైర్యం ఏంటో ఎన్నిక‌ల నాటికి కానీ.. తెలియదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: