జ‌గ‌న్‌కే ఎదురు తిరిగిన మంత్రులెవరు.. ఏం జ‌రుగుతోంది..!

VUYYURU SUBHASH
ఏపీలో మంత్రి వ‌ర్గం మారుతోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గాన్ని మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న 2019లో మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేసే స‌మ‌యంలోనే వారికి చెప్పారు. ఇప్పుడు ఏర్ప‌డుతున్న మంత్రి వ‌ర్గం రెండున్న‌రేళ్ల‌లో మారుతుంద‌ని.. 90 శాతం మంది మంత్రుల‌ను మారుస్తాన‌ని.. ఆయ‌న చెప్పారు. అంటే.. దీనిని బ‌ట్టి.. మంత్రి వ‌ర్గాన్ని పూర్తిగా కాకుండా.. ఒక‌రిద్ద‌రు కీల‌క మంత్రుల‌ను ఆయ‌న అట్టేపెట్టుకుని.. మిగిలిన వారిని మారుస్తాన‌ని అన్నారు.

అంతేకాదు..ఎప్ప‌టిక‌ప్పుడు.. మంత్రుల‌ను ఆయ‌న మార్పున‌కు సానుకూలంగా మాన‌సికంగా సిద్ధం చేస్తున్నారు. అయితే.. దీనిపై మంత్రులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. వారు ఎదురు తిర‌గ‌డం ఖాయ‌మ‌ని.. మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అదేవిధంగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు పుంఖాను పుంఖాను లుగా వ‌స్తున్నాయి. మ‌రి వీటిలో నిజ‌మెంత‌? అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో అయినా.. ఇప్పుడైనా.. జ‌గ‌న్ ను అభిమానించేవారికే జ‌గ‌న్ టికెట్లు ఇచ్చారు.

ఎక్క‌డా ఎవ‌రి ఒత్తిడికి ఆయ‌న లొంగ‌లేదు. అదేవిధంగా ప్ర‌స్తుతం ఉన్న మంత్రులు కూడా.. జ‌గ‌న్ ఎంత చెబితే.. అంత అంటూ.. చెబుతున్నారు. అంతేకాదు.. మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి వంటి వారుకూడా. మాన‌సికంగా సిద్ధంగానే ఉన్నారు. ఇక‌, ఇత‌ర‌ మంత్రులు కూడా జ‌గ‌న్ చెప్పిన‌ట్టు న‌డుచుకునేందుకు రెడీగానే ఉన్నారు. కానీ, వీరికి వ్య‌తిరేకంగా మాత్రం వార్తలు వ‌స్తున్నాయి. పోనీ.. ఎవ‌రైనా.. ఎదిరించినా.. జ‌గ‌న్‌ను కాద‌ని.. పార్టీలో జెండా ఎగ‌రేయ‌గ‌ల‌రా?  జ‌గ‌న్‌ను కాద‌ని.. వేరే పార్టీల‌లోకి చేరే అవ‌కాశం ఉందా? అనేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయం లేద‌ని.. వైసీపీ మంత్రులు, నాయ‌కులే చెబుతున్నారు. మ‌రి ప్ర‌త్యామ్నాయం లేన‌ప్పుడు.. ఎవ‌రైనా.. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారు?  పైగా.. జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకున్న‌వారే క‌దా.. వీరంతా.. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. ప్ర‌స్తుతం ఉన్న‌మంత్రుల్లో చీలిక‌లు రావ‌డం.. వారేదో.. జ‌గ‌న్‌ను ఎదిరించ‌డం.. పార్టీని బ‌ద్నాం చేయ‌డం అనేది ఇప్ప‌ట్లో జ‌రిగేది కాద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇవ‌న్నీ.. గ్యాసిప్‌లేన‌ని.. కేవ‌లం పార్టీని బ‌ద్నాం చేసేందుకు ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న కుట్రేన‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: