జ‌గ‌న్ `ర‌చ్చ‌బండ` పై వైసీపీలో ఈ కొత్త గుస‌గుస ఏందిరా బాబు...!

VUYYURU SUBHASH
ర‌చ్చ‌బండ‌. ఇదొక ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేరుతున్నా యా?  లేదా?  పాల‌నపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు?  వంటి కీల‌క విష‌యాల‌పై.. నేరుగా ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌ను క‌లిసి.. తెలుసుకునే కార్య‌క్ర‌మం. ప్ర‌జ‌ల‌తో ముఖ్య‌మంత్రి మ‌మేకం అయ్యే కార్య‌క్ర‌మం. ర‌చ్చ బండ‌. గ‌తంలో 2009లో సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. ఈ ర‌చ్చ బండ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించేందుకు  వెళ్లి.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న కుమారుడు.. సీఎం జ‌గ‌న్‌.. ఇదే కార్య‌క్ర‌మం ప్రారంభించాల‌ని.. అనుకున్నారు.

వాస్త‌వానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన తొలి ఏడాదే.. ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాల‌ని భావించారు. త‌న తండ్రి మ‌ధ్య‌లో ఆపేసిన ఈ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయాల‌ని ప్లానింగ్ చేసుకున్నారు. అయితే.. క‌రోనా కార‌ణంగా.. కొంత ఆల‌స్య‌మైంది. గత ఏడాది.. క‌డ‌ప‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ త్వ‌ర‌లోనే తాను ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి వ‌స్తాన‌ని.. ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లుస్తాన‌ని.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎవ‌రైనా.. అంద‌డం లేద‌ని.. త‌మ‌కు ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నులు చేర‌డం లేద‌ని.. ఎవ‌రైనా. చెబితే.. సీరియ‌స్ యాక్షన్ తీసుకుంటాన‌ని.. అధికారుల‌ను ఉద్దేశించి చెప్పారు.

దీంతో అప్ప‌టి నుంచి జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని త్వ‌రలోనే ప్రారంభిస్తారంటూ.. నాయ‌కులు భావిస్తూవ‌చ్చారు. అయితే.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌లేదు. మ‌రోవైపు.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు పూర్త‌వుతున్నాయి. త్వ‌ర‌లోనే.. మంత్రివ‌ర్గాన్ని మారుస్తున్నారు. సో.. వ‌చ్చే రెండేళ్ల‌కాలంలో కీల‌క నిర్ణ‌యాలు.. ప‌నులు.. ప్రారంభోత్స‌వాలు.. పెట్టుబ‌డులు.. ఇలా అనేక విష‌యాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో.. ఇక‌, ర‌చ్చ బండ‌కు అవ‌కాశం లేద‌ని.. వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. అయితే.. ఉగాది త‌ర్వాత‌.. సీఎం జ‌గ‌న్ ఈ దిశ‌గా ఆలోచించే అవ‌కాశం ఉంద‌ని.. అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. అత్యంత కీల‌క‌మైన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాన్ని చేప‌డితే.. ప్ర‌జ‌ల్లో ఉన్న స‌మ‌స్య‌లు.. చాలా వ‌ర‌కు ప‌రిష్కారం కావ‌డంతోపాటు.. పార్టీ కూడాబ‌లోపేతం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చూడాలి.. మ‌రి.. ఈ విష‌యంపై జ‌గ‌న్ ఎప్పుడు నిర్ణ‌యం తీసుకుంటారో.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: