జగన్..! ఆ 48 వేల కోట్లు ఏమయ్యాయ్‌?

రాజ్యాంగం మన దేశాన్ని కాపాడేందుకు అనేక స్వతంత్ర్య వ్యవస్థలను ఏర్పాటు చేసింది. అలాంటి వాటిలో కాగ్‌ ఒకటి.. అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. ఈ వ్యవస్థ ఏంచేస్తుందంటే.. ప్రభుత్వం తరపున జరిగే లావాదేవీలు అన్నింటినీ ఆడిటింగ్ చేస్తుంది. అన్నీ లెక్కల ప్రకారం జరుగుతున్నాయా.. అంతా రాజ్యాంగం ప్రకారం నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా లేదా..అన్నది చెక్ చేస్తుంది.. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసి అసెంబ్లీకి, పార్లమెంట్‌కు సమర్పిస్తుంది.

ఇదీ కాగ్‌ పని.. అంతకు మించి ఈ కాగ్‌కు న్యాయ అధికారాలు ఉండవు.. కాగ్‌ ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపినా.. దానికి శిక్షించే అధికారం ఉండదు. కానీ.. ఈ కాగ్‌ రిపోర్టును రాజకీయ పార్టీలు తమ అస్త్రాలుగా మలచుకుంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. తాజాగా ఏపీ అసెంబ్లీకి కాగ్ సమర్పించిన రిపోర్టులో రూ. 48 వేల కోట్ల రూపాయలకు సరైన లెక్కలు లేవు.. బడ్జెట్‌లో చెప్పకుండా ఖర్చు చేశారని ఉన్నట్టు టీడీపీ ఆరోపిస్తోంది.

ఇప్పుడు ఈ రూ.48 వేల కోట్ల రూపాయల అంశాన్ని టీడీపీ అందిపుచ్చుకుంటోంది. మేం ముందు నుంచి చెబుతూనే ఉన్నాం.. జగన్ అంతా అడ్డగోలుగా చేస్తున్నాడు.. ఇప్పుడు ఈ బిగ్ స్కామ్ బయటపడిందని టీడీపీ రచ్చ స్టార్ట్ చేసింది. దీన్ని రచ్చ అని కూడా అనకూడదు. అది ప్రధాన విపక్షం బాధ్యత. ప్రజాపద్దుల సంఘం అధ్యక్షుడైన పయ్యావుల కేశవ్ ఈ అంశాన్ని ప్రధానంగా వెలుగులోకి తీసుకొస్తున్నారు.

ఆ రూ. 48 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి జగన్.. అంటూ నిలదీస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం మూడేళ్లలో అప్పులు, అవినీతి, వ్యవస్థల విధ్వంసం చేసిందని పయ్యావుల విమర్శిస్తున్నారు. ఇంతకు మించి జగన్ సాధించిందేమీ లేదంటున్నారు. రూ.48వేల కోట్లకు పైగా సొమ్ము ఎక్కడకు పోయిందో లెక్కలు చెప్పాలని పయ్యావుల కేశవ్ తో పాటు యనమల రామకృష్ణుడు వంటి సీనియర్లు నిలదీస్తున్నారు. దీనికి జగన్ సర్కారు సరైన సమాధానం చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: