జ‌గ‌న్ మంత్రుల జాబితాకు ముందు ఎన్ని ట్విస్టులో... !

VUYYURU SUBHASH
మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు అవుతోంది. జూలై 8న దివంగ‌త వైఎస్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని వైసీపీ ప్లీన‌రీ నిర్వ‌హిస్తోంది. ఈ ప్లీన‌రీ అనంత‌రం.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ లేదా.. ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనికి ముందే మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించే ఆలోచ‌నలో కూడా జ‌గ‌న్ ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఎందుకంటే.. అప్ప‌టి వ‌ర‌కు అంటే.. కొత్త‌గా వ‌చ్చే మంత్రుల‌కు క‌నీ సం రెండు సంవ‌త్సరాలు కూడా లేక‌పోతే.. వారు పుంజుకోవ‌డం క‌ష్ట‌మ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే.. మంత్రి వ‌ర్గాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా విస్త‌రించి.. మిగిలిన వారికి బాధ్య‌త‌లు ఇచ్చేస్తే.. వారు పుంజుకుంటార‌ని ఒక ఆలోచ‌న చేస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు.. మంత్రి వ‌ర్గాన్ని రెండున్న‌రేళ్ల‌కే విస్త‌రించాలి. కానీ, క‌రోనా కార‌ణంగా.. ఇది ఆల‌స్య‌మైంది. దీంతో ఇప్పుడున్న మంత్రులు దాదాపు మూడేళ్లు పూర్తి చేస్తున్న‌ట్టుగా నే భావించాలి. సో.. వ‌చ్చే వారు.. మ‌రింత‌గా పుంజుకుని ప‌నిచేయాలంటే.. వారికి తొలి ఆరు మాసాలు కూడా శాఖ‌ల‌ను అర్ధం చేసుకోవ‌డం.. అధికారుల‌పై ప‌ట్టు పెంచుకోవ‌డం.. ప్ర‌జ‌ల‌కు అందుతున్న సంక్షేమం.. ఇత‌ర అంశాల‌పై ప‌ట్టు సాధించేందుకు స‌రిపోతుంది. అంటే.. ఎంత వేగంగా వేసుకున్నా.. కొత్త మంత్రులు పుంజుకునేందుకు క‌నీసం ఆరు మాసాల సమ‌యంలో పోయినా.. మిగిలిన ఏడాదిన్న‌ర మాత్ర‌మే వారికి మిగులుతుంది.

అందునా.. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కుముందు ఆరు మాసాలు అదో హ‌డావుడిగా ఉంది. సో.. ఇత‌మిత్థంగా కొత్త‌మంత్రుల‌ను ఇప్ప‌టికి ప్పుడు.. నియ‌మిస్తే.. వారికి ఉండే స‌మ‌యంలో రెండుసంవ‌త్స‌రాలే. ఇంకా లేటు చేస్తే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇదే విష‌యంపై  జ‌గ‌న్ కూడా  దృష్టిపెట్టిన‌ట్టుచెబుతున్నారు. అందుకే మంత్రుల జాబితాను సిద్ధం చేసేప‌నివేగిరం చేయాలంటూ.. తాజాగా ఆయ‌న మ‌రోసారి స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిల‌కు సూచించిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. ఈ ద‌ఫా మ‌రింత విద్యావంతుల‌కు ప‌ట్టం క‌ట్టాల‌ని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ.. మైనార్టీ వ‌ర్గాల‌తోపాటు.. ఇంకా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు., మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: