ఆ సీరియ‌స్ ఇష్యూపై వైసీపీలో పెద్ద డిస్క‌ర్ష‌న్‌..!

VUYYURU SUBHASH
వైసీపీ నేత‌ల మ‌ధ్య అత్యంత సీరియ‌స్ ఇష్యూ ఒక‌టి హ‌ల్చ‌ల్ చేస్తోంది. మ‌న రాష్ట్రం కూడా శ్రీలంక‌గా మారిపోతుందా? అనేది వీరి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం. నిజానికి ప్ర‌తిప‌క్షాలు చేయాల్సిన ఇలాంటి ఆలోచ‌న వైసీపీ నేత‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యానికి కార‌ణంగా మారింది. ఎందుకంటే.. మ‌న దేశానికి ఆనుకుని ఉన్న శ్రీలంక దేశంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి ఏమంత బాగోలేదు. అక్క‌డ తిన‌డానికి తిండి లేదు... కొనేందుకు కూడా స‌రుకులు దొర‌క‌డం లేదు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు మండిపోతున్నాయి.
దీంతో ప్ర‌జ‌లు వ‌ల‌స బాట ప‌ట్టారు. ఎవ‌రికి అనుకూలంగా ఉన్న దేశానికి ప్ర‌జ‌లు వెళ్లిపోతున్నారు. దీనికి కార‌ణం.. గ‌త 2020లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అక్క‌డి రాజ‌పక్స కుటుంబం నుంచి ముగ్గురు నాయ‌కులు పోటీ చేశారు. ఒక‌రు అధ్య‌క్షుడు, మ‌రొక‌రు ప్ర‌ధాని, ఇంకొక‌రు ఆర్థిక మంత్రి. తీవ్ర రాజ‌కీయ పోరాటంలో ముగ్గురు అన్న‌ద‌మ్ములు కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే వారు ప్ర‌జ‌లకు అలివి కాని హామీలు ఇచ్చారు. రేష‌న్ ఉచితం, 100యూనిట్ల‌లోపు విద్యుత్ ఉచితం, సామాజిక పింఛ‌న్లు, ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో చేర్పించేవారికి నెల‌కు రూ.5 వేల చొప్పున ప్రోత్సాహం.. ఇలా అన‌నేక హామీలు గుప్పించారు.
అధికారంలోకి వ‌చ్చిన‌ త‌ర్వాత‌.. వాటిని అమ‌లు చేశారు. దీంతో దేశ ఆర్థిక ప‌రిస్థితి త‌ల‌కిందులు అయింది. పైగా.. ర‌ష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో పెట్రోల్‌, ఇత‌ర ఇంధ‌నాల ధ‌ర‌లు ఆకాశాన్ని తాక‌డం.., క‌రోనా కార‌ణంగా.. దేశం మ‌రింత ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయిన‌ప్ప‌టికీ.. గ‌త ఏడాదికూడా సంక్షేమాన్ని అమ‌లు చేశారు. దీంతో ఇప్పుడు శ్రీలంక‌లో క‌రువు ఏర్ప‌డింది. అప్పులు పెరిగిపోయాయి.. ఇచ్చే నాధుడు కూడా క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామాలు.. కొన్నిరోజులుగా జాతీయ మీడియాలో ప్ర‌ధానంగా వ‌స్తున్నాయి.
శ్రీలంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను  గ‌మ‌నిస్తున్న వైసీపీ నేత‌లు.. మ‌న ద‌గ్గ‌ర కూడా ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే! అంటూ.. చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. దీనిపై సీనియ‌ర్ నాయ‌కులు.. కొంత భ‌రోసా ఇస్తున్నారు. మ‌రీ అంత దారుణ‌మైన ప‌రిస్థితులు మ‌న‌కు రావులే అని న‌చ్చ చెబుతున్నారు. కానీ, ఎక్క‌డో నాయ‌కులు మాత్రం స‌ర్దుకు పోవ‌డం లేదు. మ‌న ద‌గ్గ‌ర కూడా ఇలాంటి ప‌రిస్తితి వ‌స్తే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని మాత్రం చెబుతున్నారు. ఇప్ప‌టికే అప్పులు పెరిగిపోయాయి.. అప్పులు ఇచ్చేవారుకూడా లేదు. మ‌రో వైపు రెండేళ్ల‌పాటు పాల‌న సాగాలి..ఎలా? అని త‌ల‌లు ప‌ట్టుకున్న ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: