2023 సంక్రాంతి త‌ర్వాతే ఏపీ ఎన్నిక‌లు.. వైసీపీలో ఇదే హాట్ టాపిక్‌..!

VUYYURU SUBHASH
ఔను! ఇప్ప‌టికిప్పుడు వైసీపీ స‌ర్కారు ఎన్నిక‌ల‌కు వెళ్తుందా?  ఆ దిశ‌గా జ‌గ‌న్ కూడా ఆలోచ న చేస్తున్నారా ? అంటే.. వైసీపీలోని ఓ వ‌ర్గం.. ఔన‌నే అంటోంది. ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఇది నిజ‌మేన‌న చెబుతు న్నారు. తాజాగా అసెంబ్లీలో జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న చూసిన త‌ర్వాత‌.. ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మేన‌ని చెబుతున్నారు. మూడు రాజ‌ధాను ల విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్ర‌భుత్వం ఏకీభ‌వించ‌డం లేదు. పైగా.. మూడు రాజ‌ధానుల‌కే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

అయితే.. దీనిచుట్టూ అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. ప్ర‌జ‌లు అస‌లు ఒప్పుకోవ‌డం లేద‌ని.. ప్ర‌తిప‌క్షం చెబు తోంది. న్యాయ‌పర‌మైన చిక్కులు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను ఒప్పించాలంటే.. ఇప్ప‌టికి ప్పుడు, ఇదే అంశంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. తీర్పును కోర‌డం. తద్వారా.. పార్ల‌మెంటులోనూ చ‌ర్చ‌కు తెర‌దీసి.. మార్పులు చేయించ‌డం వంటివి జ‌గ‌న్ ముందు ఉన్న ప‌రిష్కారాలుగా వైసీపీ సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నారు. ఇప్ప‌టికే దేశంలో ఎక్క‌డా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అమ‌లు అవుతున్న సంక్షేమం.. వైసీపీకి మేలు చేస్తుంద‌ని అంటున్నారు.

పైగా. మూడు రాజ‌ధానులు అంటే.. అటు ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు, ఇటు సీమ ప్ర‌జ‌లు కూడా వైసీపీ వైపే ఉన్నార‌ని.. ఆ పార్టీనేత‌లు న‌మ్ముతున్నారు. పైగా .. అమ‌రావ‌తిని తాము పూర్తిగా ఎత్తేయ‌డం లేద‌ని.. దీనిని శాస‌న రాజధానిగా పేర్కొంటున్నామ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పటికిప్పుడు ప్ర‌జాతీర్పు కోర‌డ‌మే.. మంచిద‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. త‌ద్వారా.. ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌పై ఎదుర్కొంటున్న ప్ర‌తిప‌క్షం స‌హా ఇత‌ర మీడియా వ‌ర్గాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌ని కూడా చెబుతున్నాయి.

అయితే.. ఇప్ప‌టికిప్పుడు అంటే.. ఈ ఏడాది చివ‌రి నాటికి లేదా.. వ‌చ్చే ఏడాది ప్రారంభం నాటికి జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న చేస్తున్నార‌ని కూడా మరికొంద‌రు అంటున్నారు. సంక్షేమానికితోడు.. అన్ని ప్రాంతాల అభివృద్ధి అజెండా త‌మ‌కు మేలు చేస్తుంద‌ని.. ఆయ‌న కూడా గ‌ట్టిగానే న‌మ్ముతున్నార‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. అంటే.. సీఎం జ‌గ‌న్ క‌నుక ఆ దిశ‌గా నిర్ణ‌యం తీసుకుంటే.. ముంద‌స్తుకు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని.. జ‌గ‌న్‌కు ఎలాంటి సెంటిమెంట్లు కూడా  అడ్డురావ‌న‌ని చెబుతున్నారు.మరి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: