వైసీపీలో మితిమీరుతోన్న స్వామి భ‌క్తి... మొద‌టికే మోసం వ‌స్తుందా ?

VUYYURU SUBHASH
వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీద‌కి వ‌చ్చింది. ప్ర‌స్తుతం అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిపక్షం ఆందోళ‌న చేయ‌డం.. అధికార ప‌క్షం ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయ‌డం స‌హజంగా మారిపో యింది. అయితే.. ఈ సంద‌ర్భంగా అధికార ప‌క్షం నాయ‌కులు.. సీఎం జ‌గ‌న్‌ను భారీ ఎత్తున పొగ‌డ్త‌ల‌తో ముం చెత్తుతున్నారు. వాస్త‌వానికి ఏ పార్టీ అయినా... త‌మ నాయకుడిని పొగ‌డ‌డం అనేది కామనే. దీనిని ఎవ‌రూ కాదన‌రు. కానీ, ప్ర‌స్తుతం అసెంబ్లీలో హ‌ద్దులు మీరుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

సీఎంను రాముడు, దేవుడు అన‌డం కొన్ని రోజుల కింద‌టి వ‌ర‌కు విన్నాం. అయితే.. ఇప్పుడు దీనిని కూడా దాటిపోయారు. మంత్రి నారాయ‌ణ‌స్వామి.. తాజాగా అసెంబ్లీలో మాట్టాడుతూ.. జ‌గ‌న్ వేసిన భిక్షంతో తాము విజ‌యం ద‌క్కించుకున్నామ‌ని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు... ప‌దేప‌దే భిక్షం-భిక్షం.. అంటూ వ్యాఖ్యా నించారు. ఇక‌, రెండు రోజుల కింద‌ట‌.. శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న‌రెడ్డి కూడా ఇలానే వ్యాఖ్యా నించారు. జ‌గ‌న్ ద‌య వ‌ల్లే.. తాము విజ‌యం ద‌క్కించుకున్నామ‌ని.. అన్నారు.

అంతేకాదు.. తామకు ఏమాత్రం స‌త్తా లేద‌ని.. కేవ‌లం.. తాము.. జ‌గ‌న్ ద‌య‌వ‌ల్లే గెలిచామ‌ని అన్నారు.. అస‌లు ఈ మాట‌లు ఎంత జుగుస్సా క‌రంగా ఉన్నాయో ? త‌మ‌ను తాము ఇంత దిగ‌జ‌రార్చుకుంటారా ? అన్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. స్వామి భ‌క్తిఎంతైనా ఉండొచ్చు.. కానీ, మ‌రీ ఇంత‌గా అవ‌స‌ర‌మా..? అని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల నుంచి టాక్ వినిపిస్తోంది. జ‌గ‌న్ స‌త్తా ఉండొచ్చు. కానీ, నాయ‌కుల ప్ర‌భావం కూడా ఉంటుంది క‌దా! అంటున్నారు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి త‌మ‌ను తాము.. త‌క్కువ చేసుకుని వ్య‌వ‌హ‌రించుకునేలా చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌నేది.. ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

అంతేకాదు.. వ్య‌క్తిత్వ హ‌ననం చేసుకుని.. మ‌రీ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌.. నాయ‌కులుగా ఇబ్బందులు ఎదుర‌వుతాయేమోన‌ని అంటున్నారు. మరి నాయ‌కులు మారాల్సిన అవ‌స‌రాన్ని గుర్తిస్తారా ?  లేదా స్వామి భ‌జ‌న చేస్తూ ప్ర‌జ‌ల్లో త‌మ‌ను తాము చుల‌క‌న చేసుకుంటారా ? అన్న‌ది వారే తేల్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: