నో డౌట్: క్యాబినెట్‌లో ఆ ముగ్గురు ఫిక్స్...!

VUYYURU SUBHASH

తాజాగా సీఎం జగన్ క్యాబినెట్ విషయంలో చేసిన ప్రకటనపై ఇప్పుడు రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే..జూన్ నెలలో ఆయన మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పారు..కాకపోతే మొత్తం మంత్రివర్గాన్ని మార్చేస్తారా? లేక కొంతమందిని కంటిన్యూ చేస్తారనే అంశంపై క్లారిటీ రావడం లేదు. కాకపోతే జగన్ మాత్రం కొన్ని కారణాల వల్ల కొంతమందిని కంటిన్యూ చేయొచ్చనే హింట్ మాత్రం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎవరిని మంత్రివర్గంలో కంటిన్యూ చేస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ముగ్గురు మంత్రులని మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్‌లో కొనసాగిస్తారని తెలిసింది..సీనియర్ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గంలో కొనసాగుతారని క్లారిటీ వచ్చేసింది..అలాగే ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సైతం కంటిన్యూ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారని తెలిసింది. ఎందుకంటే ఆర్ధిక మంత్రిగా బుగ్గన తప్ప మరొకరు ఆ శాఖని నడపటం కష్టమే.
అంటే బాలినేని, బొత్స, బుగ్గన లు మాత్రం క్యాబినెట్‌లో కొనసాగనున్నారు. అందుకే తాజాగా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం వారికి శుభాకాంక్షలు చెప్పారు. దీని బట్టి చూస్తే ఈ ముగ్గురుని మళ్ళీ కంటిన్యూ చేస్తారని అర్ధమవుతుంది..అటు కొడాలి నాని విషయంలో కూడా కాస్త క్లారిటీ వచ్చేలా ఉంది..కేవలం చంద్రబాబు, లోకేష్‌లని తిట్టడానికి ఉన్న కొడాలిని మంత్రివర్గంలో కొనసాగిస్తే బెటర్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
పైగా కమ్మ వర్గంలో కొడాలిని మించిన పవర్‌ఫుల్ లీడర్ మాత్రం లేరు...ఉండటానికి అయిదారుగురు కమ్మ ఎమ్మెల్యేలు ఉన్న సరే..వారికి కొడాలికి ఉన్న కెపాసిటీ లేదు. అటు ఎమ్మెల్సీ తలశిల రఘురాం సైతం మరీ పవర్‌ఫుల్ నాయకుడు ఏమి కాదు. కాబట్టి కొడాలిని కూడా కంటిన్యూ చేసే ఛాన్స్ మాత్రం ఉన్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి చివరికి ఎవరు క్యాబినెట్‌లో ఉంటారో ..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: