బాబు-పవన్‌లని విడదీసేందుకు వైసీపీ ప్లాన్‌..?

VUYYURU SUBHASH
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే విషయంపై అనేక రకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెడతాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి డేంజర్ అనే చెబుతున్నారు...ఎందుకంటే 2014లో రెండు పార్టీలు కలవడం వల్లే వైసీపీకి చెక్ పడింది..ఇక 2019 ఎన్నికల్లో విడిగా ఉండటం వల్లే వైసీపీ లాభపడింది...జనసేన పూర్తిగా ఓట్లు చీల్చేసి...టీడీపీ గెలుపుపై ప్రభావం చూపింది. జనసేన వల్ల టీడీపీ పూర్తిగా నష్టపోగా,వైసీపీ లాభపడింది.
అయితే వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్తితి మాత్రం ఉండకూడదని టీడీపీ భావిస్తుంది..అందుకే జనసేనని కలుపుకుంటేనే బెటర్ దిశగా ఆలోచిస్తుంది. ఇప్పటికే పొత్తు దిశగా మాట్లాడినట్లు చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే...కాకపోతే పవన్ కల్యాణ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది..అయితే పవన్ సైతం...చంద్రబాబుతో కలిసి ముందుకెళితేనే బెటర్ అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది..ఎందుకంటే టీడీపీతో కలిస్తేనే జనసేనకు కాస్త ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి..లేదంటే ఆ పార్టీ కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది.
ఇక ఇప్పటికిప్పుడు పొత్తు లేకపోయినా..వచ్చే ఎన్నికల ముందు మాత్రం పొత్తు తప్పనిసరిగా ఉండేలా ఉంది. ఈ పొత్తు వల్ల మాత్రం వైసీపీకి నష్టం జరగడం ఖాయమని చెప్పొచ్చు. ఈ విషయం వైసీపీకి ముందే అర్ధమైందని చెప్పొచ్చు...అందుకే వైసీపీ వాళ్ళు...టీడీపీ-జనసేనల పొత్తు లేకుండా వారి మధ్య చిచ్చు పెట్టేలా రాజకీయం నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పవన్ సినిమాకు టీడీపీ అండగా నిలిచిన విషయం తెలిసిందే...!
అయితే వీరు ఎక్కడ కలిసిపోతారని అనుకున్నారేమో అందుకే కొడాలి నాని అనూహ్యంగా తెరపైకి వచ్చి.. రాజకీయావసరాల కోసం చంద్రబాబు దారిలో పవన్‌ నడవడం సిగ్గు చేటని, చంద్రబాబు వెనకున్న కొంతమందిని శ్రేయోభిలాషులుగా భావించి, వారి సలహాలతో ముందుకెళితే 2024 ఎన్నికల్లో జనసేనకు చంద్రబాబు 25-30 సీట్లిస్తారని, చంద్రబాబును సీఎంగానో, ప్రతిపక్ష నేతగానో చేయడానికి పవన్‌ పావుగా ఉపయోగపడతారని అన్నారు. అంటే పవన్‌ని చంద్రబాబు వాడుకుంటున్నారనే కోణంలో నాని మాట్లాడారు...వారిని విడదీసే విధంగానే కొడాలి రాజకీయం చేశారని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: