వాహనదారులకి గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..! ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తున్నారు గా..?

Chakravarthi Kalyan

ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్‌ మొదటి రెండు స్థానాల్లో నిలుస్తోంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యం అందడం లేదు.  సమీపంలోని ఆస్పత్రికి తరలించినా.. ఫీజు చెల్లించనిదే మెరుగైన వైద్యం అందడం లేదు. ఇలాంటి పరిస్థితిలో క్షతగాత్రులు మరణిస్తున్నారు.


ఈ నేపథ్యంలో కేంద్రం క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందేలా కొత్త స్కీం తీసుకువచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.  ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోటీసులకు సమాచారం అందగానే బాధితులకు చికిత్స కోసం ఏడు రోజుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సాయం అందిస్తారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తారు.  ఈ పథకం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు దేశమంతా అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు మంత్రి ప్రకటించారు.


రవాణా శాఖ మంత్రులతో నితిన్‌ గడ్కరీ సమావేశం నిర్వహించారు.  రోడ్డు భద్రత ప్రధాన లక్ష్యమని తెలిపారు.  దేశంలో 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది మరణించారని తెలిపారు. అందులో 30 వేల మంది హెల్మెట్‌ లేకపోవడంతో మరణించారని పేర్కొన్నారు. ప్రమాదాల్లో మరణించిన వారిలో 66 శాతం మంది 18 నుంచి 34 ఏళ్లలోపువారే.  ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల కారణంగా 10 వేల మంది చిన్నారులు మరణించారని వివరించారు.


ప్రమాదాల నివారణకు డ్రైవింగ్‌ శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం భావిస్తోంది. లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన కారణంగా గతేడాది 3 వేల మంది మరణించారని తెలిపారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు దేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దేశంలో 22 లక్షల డ్రైవర్ల కొరత ఉన్నట్లు తెలిపారు. దీనిపై కొత్త విధానం రూపొందిస్తామని తెలిపారు.


ఇక పాత వాహనాల స్క్రాపింగ్‌తో పెద్ద ఎత్తున ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.  అల్యూమినియం, కాపర్, స్టీల్, ప్లాస్టిక్‌ వంటి పదార్థాలను రీసైకిల్‌ చేస్తామని తెలిపారు. మారుతి సుజుకీ స్క్రాపింగ్‌ సెంటర్‌ కొన్ని భాగాలను జపాన్‌కు ఎగుమతి చేస్తుందన్నారు. టైర్‌ పౌడర్‌ను బిటుమెన్‌లో కలుపుతున్నారు. ఇది సర్క్యూలర్‌ ఎకానమీగా మారుతుంది. స్క్రాపింగ్‌ విధానం దేశంలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.18 వేల కోట్ల అదనపు జీఎస్టీ ఆదాయం పొందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: