తెలంగాణలో ఆ ఎనిమిది కులాల పేర్లు మార్పు..? ఏంటి అవి అంటే?

Chakravarthi Kalyan

కులం పేర్లను ఇప్పటికీ , తిట్లగా ఉపయోగిస్తున్నారు. సినిమాలు, రాజకీయాల వేదికలపై కొన్ని కులాల పేర్లు మనస్సుని బాధించేలా, అవమాన కరంగా ఉంటున్నాయి.  ఈ విషయం చూసి, ఆయా కులాలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వారి కులాన్ని అవమానించడం, ఆత్మాభిమానం దెబ్బతీయడం లాంటివి జరుగుతున్నాయని వారు ఆవేదనతో స్పందిస్తున్నారు.


తమ కులాలను చులకనగా, తిట్లుగా ఉపయోగించడం కంటే, ఈ కులాల పేర్లను మార్చాలని పలు కుల సంఘాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో, బీసీ కమిషన్‌కు కూడా కొన్ని సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బీసీ జాబితాలో ఉన్న ఎనిమిది కులాల పేర్లను మార్చాలని, కొన్ని పర్యాయపదాలు జోడించాలని సూచనలు వచ్చాయి.  



తెలంగాణ బీసీ కమిషన్ ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలను కోరింది. దీనిని సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసారు. సమాజంలో కొన్ని పేర్లు అవమానకరంగా వినిపిస్తున్నాయి, వాటిని మార్చాలని బహిరంగ విచారణలో తేలింది. బీసీ కమిషన్ కార్యాలయంలోనూ పలువురు కుల సంఘాల ప్రతినిధులు విన్నవించారు. ఈ విషయంపై కమిషన్ ప్రాథమిక చర్చలు నిర్వహించింది.


ఈ పేర్ల మార్పులపై ఎవరైనా అభ్యంతరాలు, సూచనలు ఉన్నా, వాటిని తెలుపమని నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఈ నెల 18వ తేదీ వరకు, హైదరాబాద్‌లోని జలమండలి ఆవరణలోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ అభ్యంతరాలు, సూచనల ఆధారంగా కులాల పేర్ల మార్పుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని బీసీ కమిషన్ కార్యదర్శి బాలమాయాదేవి వెల్లడించారు.



దొమ్మర (బీసీ ఏ) - గాంద వంశీయ, తమ్మలి (బ్రాహ్మణేతరులు, శూద్రులు) - బ్రాహ్మణేతర, శూద్ర పదాల తొలగింపు రజక (చాకలి, వన్నర్) - వన్నర్ తొలగించి దోబి పర్యాయపదం చేర్పు, బుడబుక్కల - ఆరె క్షత్రియ జోషి / శివ క్షత్రియ / రామజోషి, కుమ్మర లేదా కులాల, శాలివాహన - ప్రజాపతి పర్యాయ పదం చేర్పు, చిప్పోళ్లు (మేర) - మేర, వీరముష్ఠి (నెట్టికొటాల), వీరభద్రీయ - వీరభద్రీయ ఈ మార్పులతో, కులాల పేర్లకు మరింత గౌరవాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: