టీటీడీ బోర్డులో పవన్ మార్క్? ఎక్కడా తగ్గడం లేదుగా..?

Chakravarthi Kalyan

ఎట్టకేలకు టీటీడీ ట్రస్ట్ బోర్డు నియమించింది చంద్రబాబు సర్కార్. సుదీర్ఘ కసరత్తు తర్వాత 23 మందితో కమిటీని ప్రకటించారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోస్ట్ పై రకరకాల చర్చ నడిచింది. రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా టీవీ5 ఛానల్ అధినేత బి ఆర్ నాయుడు కు చైర్మన్ పోస్ట్ దక్కింది. అయితే 23 మంది సభ్యులను సైతం నిర్మించారు.



ఇందులో టిడిపి తో పాటు జనసేన, ఇతర రాష్ట్రాల్లోని బిజెపి నేతల సిఫార్సులకు ప్రాధాన్యం ఇచ్చారు. టీటీడీ చైర్మన్ గా మీడియా రంగానికి చెందిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు నియమితులయ్యారు. మాజీ సిజెఐ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు సైతం సభ్యుడిగా ఎంపిక చేశారు. టిడిపి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులకు, జనసేన కోటాలో ముగ్గురికి స్థానం దక్కింది.  జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డిప్రశాంతి రెడ్డి, ఎంఎస్ రాజును నియమించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి సైతం బోర్డులో చోటు దక్కింది. తెలంగాణ టిడిపి నేత నన్నూరి నర్సిరెడ్డి సైతం బోర్డు సభ్యుడిగా నియమించారు.



జనసేన నుంచి అనూహ్యంగా ముగ్గురికి చోటు దక్కడం విశేషం. తెలంగాణ జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి సభ్యుడిగా నియమితులయ్యారు.  ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. అలాగే జనసేన వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీకి టీటీడీలో చోటు కల్పించారు. ఆమె భర్త ఎంసీదాస్ పార్టీ ట్రెజరర్ గా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద్ సాయి కి సైతం అవకాశం కల్పించారు.  


మరోవైపు ఎన్నారై విభాగం నుంచి జాస్తి సాంబశివరావును నియమించారు. నన్నపనేని సదాశివరావు రాజధాని ప్రాంతానికి చెందినవారు. భారత్ బయోటిక్ ఎండి సుచిత్ర ఎల్లాకు సైతం టీటీడీ ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్యంత సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తికి నాలుగోసారి అవకాశం దక్కింది.  మొత్తానికి రాజకీయ పార్టీలతో పాటు అన్ని రంగాల ప్రముఖులకు ఛాన్స్ ఇచ్చినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: