ఆ ఆయుధం తో చైనాని భయపెడుతున్న మోదీ?

Chakravarthi Kalyan

ప్రిడేటర్ డ్రోన్లు చలా సామర్థ్యం కలిగినవి. అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణతో పాటు ఈ ప్రిడేటర్ డ్రోన్లు శత్రువును గుర్తించి దాడి చేయగలవు. వాస్తవానికి యుద్ధ భూమిలో సమాచారం ప్రాణ వాయువు లాంటిది. కచ్చితమైన టార్గెట్ ని ఎంచుకొని దాడి చేయడానికి సహకరించడంతో పాటు ఆయుధాల వృథాను అరికడతాయి.  


తాజాగా కొనుగోలు చేసిన ప్రిడేటర్ డ్రోన్లు దేశ సరిహద్దుల్లో భారత్ కు ఆధిపత్యాన్ని అందించనున్నాయి. సముద్ర తీరాల్లోనే కాదు.. హిమాలయ శిఖరాల్లో మన సైన్యానికి కొత్త బలాన్ని తీసుకు రానున్నాయి. ఇప్పటికే చైనా వద్ద చియాహాంగ్-4, వింగ్ లంగ్‌ -2, దాయాది దేశం పాకిస్థాన్ వద్ద షహపర్-2, వింగ్ లంగ్ -2, బైరక్తర్ టీబీ2 వంటి డ్రోన్లు ఉన్నాయి. భారత్ వద్ద ఇప్పటి వరకు ఈ స్థాయి వి ఏవీ లేవు. కానీ ప్రస్తుత ప్రిడేటర్ డ్రోన్ల రాకతో ఎల్వోసీ, లాక్ వద్ద పరిస్థతి మారుతుంది.


ఈ డ్రోన్లు అనేక ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి, పాకిస్థాన్ తో నియంత్రణ రేఖ వెంబడి కదలికలను వారు స్పష్టంగా గుర్తించగలుగుతారు. ఈ ప్రిడేటర్ డ్రోన్లు శత్రువల బంకర్లు, రాకెట్లు, క్షిపణి వ్యవస్థలను పసిగడతాయి. వీటి సాయంతో అత్యవసర సమయంలో ప్రత్యర్థులపై కూడా దాడి చేసి పట్టుకోగలుగుతాయి.


భారత్ ఇప్పటికే ఈ రెండు స్కై గార్డియన్ డ్రోన్లను అమెరికా లోని జనరల్ అటామిక్స్ నుంచి లీజుకు తీసుకుంది. చైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినప్పుడు తూర్పు లడాఖ్ లో వీటిని మోహరించారు. ఎల్ఏసీ వెంట ఉన్న ఈ మానవరహిత వైమానిక వాహనాలు దళాలకు చాలా స్పష్టమైన చిత్రాలను అందించాయి.


ఇటీవల హంటర్ కిల్లర్ గా పిలిచే ఎమ్ క్యూ 9బీ డ్రోన్ కొనుగోలుకు ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది. భారత సైనిక శక్తిని పెంచే లక్ష్యంతో భత్రదా వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ సీసీఎస్ ఈ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి 31 ప్రిడేటర్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లు కొనుగోలు, అణుశక్తితో నడిచే రెండు జలాంతర్గాములు స్వదేశీ నిర్మాణానికి సంబంధించిన డీల్ కు ఆమోదం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: