పాపం హెజ్బోల్లా.. ! అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయారు
పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధంలోకి హెజ్బోల్లా అనే మిలిటెంట్ సంస్థ అనవసరంగా ప్రవేశించింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పై దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైనిక వ్యవస్థలపై రాకెట్లు ప్రయోగించింది. ఇరాన్… ఇతర దేశాలతో కలిసి ఇజ్రాయెల్ కు చుక్కలు చూపించాలని ప్రయత్నించింది. ఇందులో కొంత మేర విజయవంతమైంది.
దీంతో ఇజ్రాయెల్ దేశానికి ఒక్కసారిగా షాక్ తగిలింది. దీంతో ఆ దేశం అంతర్మదనంలో పడింది. ఆ తర్వాత తన బుర్రకు పదును పెట్టింది. తనను ఇబ్బంది పెట్టిన హెజ్బోల్లా మిలిటెంట్ సంస్థ పని పట్టింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం చేసి వెళ్లిపోయింది. అంతర్జాతీయ సైనిక నిపుణులు కూడా ఇజ్రాయెల్ చేసిన దాడిని సరికొత్తగా అభివర్ణిస్తున్నారు. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ మెగా సంస్థ మొస్సాద్ ఉండి ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హెజ్బోల్లా మిలిటెంట్ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులను చంపడానికి వేలాది పేజర్లను ఇజ్రాయెల్ ఉపయోగించింది. అందులో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను అమర్చింది. తైవాన్ దేశంలో తయారైన పరికరాలను ఇజ్రాయెల్ దీనికోసం ఉపయోగించింది. ఇజ్రాయెల్ నిఘా బృందం కొంత కాలంగా హెజ్బోల్లా మిలటెంట్ గ్రూపునకు చెందిన నంబర్ కమాండర్ ఫా్ద షుక్రును మట్టు పెట్టడానికి ముందు అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
ఆ కాల్ అతడు ఎత్తగానే ఇజ్రాయెల్ టార్గెట్ లోకి వెళ్లిపోయారు. అయితే ఈ ముప్పును హెజ్బోల్లా చీఫ్ హసన్ నశ్రుల్లా ఫోన్లపై నిషేధం విధించారు. దీంతో పేజర్ల వినియోగం ఇజ్రాయెల్, హెజ్బోల్లా మధ్య సర్వసాధారణంగా మారింది. ఈ పేజర్లలో ఇజ్రాయెల్ అత్యంత శక్తిమంతమైన పెంటా ఎరిత్రటాల్ ప్లాస్టిక్ పేలుడు పదార్థాన్ని వాడింది. ఈ పదార్థాన్ని సైనిక దశాలు, భవనాలు కూల్చివేత సమయంలో వాడుతుంటారు.
వాహనాల్లోని బ్యాటరీ ఉష్ణోగ్రతను పెంచి కూడా పేజర్ల మాదిరి పేల్చవచ్చు. హెజ్బోల్లా మిలిటెంట్లపై పేజర్లు పేలినప్పుడు ముందుగా బీఫ్ అనే శబ్ధం వచ్చిందంట. అయితే ఆ దాడి నుంచి హెజ్బోల్లా చీఫ్ బయటపడ్డారు. అయితే ఆ సంస్థకు చెందిన ఇద్దరు ఎంపీల కుమారులు, మరో ఏడుగురు చనిపోయారు. మొత్తం 3000 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ సాంకేతికత ముందు పెద్ద పెద్ద దేశాలే తల వంచుతాయని.. అలాంటిది హెజ్బోల్లా ఎలా నిలుస్తుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.