గుడ్లవల్లేరు కాలేజీలో అసలు జరిగింది ఇదా?

Chakravarthi Kalyan

రెండు, మూడు రోజులుగా ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఉదంతంపై చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బోలెడన్నీ కథనాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం దేన్ని నమ్మాలి. దేన్ని నమ్మకూడదు అనే కన్ప్యూజన్ పెరిగిపోతుంది. ఇలాంటి వేళ తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.


ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిడెన్ కెమెరా ఉందంతంపై క్లారిటీ ఇచ్చారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థులు ఎందుకింత ఆందోళన చెందారు? పెద్ద ఎత్తున వీడియోలు బయటకు వచ్చాయని.. హిడెన్ కెమెరాలు పెద్ద ఎత్తున అమర్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు లోకేశ్.

 హిడెన్ కెమెరా పెట్టారని చెబుతున్నారు కదా. అంటూ జాతీయ మీడియా విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన లోకేశ్.. దొరికిపోయింది ఏదో అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. వీడియో ఎక్కడ ఉందంటే ఎవరికీ తెలియదు. కెమెరా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. 300 వీడియోలు బయటకు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఒక్క వీడియో అయినా ఎవరి చేతుల్లో అయినా ఉందా? అని చూస్తే ఒక్కటీ లేదు.


పిల్ల అందరి ఫోనల్ఉ జప్తు చేసి లాక్ చేసినా ఒక్కటీ దొరకలేదు. లేని వీడియోలకు నెనేలా సమాధానం చెబుతాను అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో హిడెన్ కెమెరా ఎక్కడ ఉందో తెలీదన్న లోకేశ్ ఇష్యూ జరిగింది మాత్రం నిజమేనని అన్నారు. నలుగురి మధ్య లవ్ స్టోరీ లో ఏ చర్యలు తీసుకోవాలో అధికారులు చూసుకుంటారని.. అధికారికంగా వారపై చర్యలు ఉంటాయని లోకేశ్ స్పష్టం చేశారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనలో కెమెరా లేదని.. వీడియోలు అంటూ జరిగిన ప్రచారం అంతా అబద్దమే తప్ప ఇంకేమీ లేదన్నారు.


వైసీపీ నేతల సినీ నటి వేధింపులు, మద్యం కుంభకోణం, భూ ఆక్రమణలు వెలుగులోకి రావడంతో వీటిని డైవర్ట్ చేయడానిక హిడెన్ కెమెరాలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జగన మాదిరి నేను తల్లీ చెల్లిని రోడ్లపైకి గెంటేసి రకం కాదు. విద్యార్థునలందర్నీ నా తోబుట్టువులా కాపాడుకుంటా అని వ్యాఖ్యానించారు. కాగా విద్యార్థినిలుపై దురుసుగా వ్యవహరించిన స్థాప ఎస్ఐని సస్పెండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: