రాజ్యాంగ పోరాటం ఫలిస్తేనే.. అసెంబ్లీకి జగన్‌?

Chakravarthi Kalyan
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం బాగా పట్టుబడుతున్నారు. అయితే ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అనే చర్చ అయితే బలంగా సాగుతోంది. ఆయన ఇదే విషయమై న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. ఆయన హైకోర్టుకి దాఖలు చేసిన పిటిషన్లో 1953 ఏపీ యాక్ట్ ని గుర్తు చేస్తున్నారు.

అసెంబ్లీలో ప్రభుత్వంలో కాకుండా అవతల విబేధించే పక్షంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే దానిని విపక్షంగా గుర్తించవచ్చు అని ఉంది. అది కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే పాయింట్ మీద జగన్ కోర్టు తలపు తట్టారు. కోర్టు స్పీకర్ కార్యదర్శికి, అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత విచారణ ఎలా జరుగుతుంది. అసలు ఏం అవుతుంది అనే ఆసక్తి సర్వత్రా ఉంది. అయితే కోర్టులు కొంత వరకు మాత్రమే అసెంబ్లీ వ్యవహారాల విషయంలో జోక్యం చేసుకుంటాయని,, అంతకు మించి జోక్యం చేసుకోలేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జగన్ లేవనెత్తిన పాయింట్ లో విలువ ఉంటే కనుక అసెంబ్లీ కార్యదర్శి లేదా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు అడుగుతుంది. ఆ విషయంలో స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని జవాబు వస్తే అప్పుడు బంతి మళ్లీ స్పీకర్ వద్దేకే వస్తుందని అంటున్నారు. మరోవైపు
 జగన్ ఏమో ఈ విషయంపై వెనక్కి తగ్గడం లేదు. పోరాడుతున్నారు.

అవసరం అయితే సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. రాజ్యాంగంలో కూడా పది శాతం మంది సభ్యులు కచ్చితంగా ఉండాలనే నిబంధన ఏమీ లేదని కొందరు వాదిస్తున్నారు. శాసన సభ, పార్లమెంట్ తొలినాళ్లలో స్పీకర్ కనీసం పది శాతం మంది సభ్యులను  ఓ అంచనాగా పెట్టుకున్నారు. ఇప్పటికే అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ తన ఇమేజ్ ని సైతం ఫణంగా పెట్టి న్యాయస్థానల్లో పోరాడుతున్నారు. ఒకవేళ తీర్పు ఆయనకు ప్రతికూలంగా వస్తే ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చగానే ఉంది. పదకొండు మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది త్వరలోనే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: