ఇజ్రాయెల్ యుద్ధంలో కొత్త మలుపు.. భీకర దాడులు తప్పవా?
ఈ రాకెట్ దాడికి కచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆ దేశ అధ్యక్షుడు బెంజిమాన్ నెతన్యాహూ అర్ధాంతరంగా తన పర్యటన ముగించుకొని ఇజ్రాయెల్ పయనమయ్యారు. ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఘర్షణ వాతావరణం కారణంగా లెబనాన్ బీరూన్ విమనాశ్రాయలను విమానాలు రద్దు చేయడంతో పాటు కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా తాజా పరిణామాలపై అలెర్ట్ అయింది. లెబనాన్ లోని భారతీయలు కోసం ఎంబసీ అత్యవసర ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీని విడుదల చేసింది.
అయితే లెబనాన్ వేదికగా పనిచేస్తున్న హిజ్బోల్లా తీవ్ర వాద సంస్థకు ఇరాన్ దండిగా ఆర్థిక సాయం చేస్తోంది. సైనిక శిక్షణతో పాటు ఆయుధాలను సరఫరా చేస్తోంది. సిరియా కూడా తమ వంతు సాయాన్ని అందిస్తోంది. 2022లో జరిగిన ఎన్నికల్లో హెజ్ బోల్లా 13 స్థానాలు గెలుచుకొంది. హెజ్ బోల్లాపై ఇజ్రాయెల్ దాడి చేస్తే పశ్చిమ ఆసియా మొత్తం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి హెజ్ బొల్లా రాకెట్ దాడుల వల్ల ఇజ్రయెల్ నష్టాన్ని చవి చూస్తోంది. అక్కడి ప్రజలు భయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఐరన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థ ఉన్నా.. కూడా ఇజ్రాయెల్ పై హెజ్ బొల్లా దాడులు చేయడం విశేషం. హిజ్ బొల్లా సంస్థ లెబనాన్ దక్షిణ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై దాడులకు తెగబడుతోంది.