జగన్‌ను రోజూ తిట్టాడు.. ఇప్పుడు బాబూ అదే పని చేస్తున్నాడు?

Chakravarthi Kalyan
ఏపీలో అప్పుల లెక్కలు ప్రజలను కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ మధ్యే అప్పుల లెక్కలు బయట పెట్టింది ప్రభుత్వం. అయితే ఈ అంకెల గారడీ చూసి నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంపై రుణభారం అధికంగా ఉందని.. చంద్రబాబు అంటే.. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో లెక్క చెబుతున్నారు.

ఎన్నికల ప్రచార సమయంలో ఏపీ అప్పులు రూ.13 లక్షల కోట్లు అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పదే పదే ప్రచార సభల్లో ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో రూ.9.74 లక్షల కోట్లు రుణ భారం పెరిగిందని.. చంద్రబాబు అన్నారు.

అయితే దీనిపై వైసీపీ వాదన మరోలా ఉంది.  నాడు రాష్ట్ర అవసరాల కోసం అప్పు చేస్తే అప్పులతోనే నెట్టుకొస్తున్నామంటూ నిత్య దుయ్య బట్టిన ఎల్లో మీడియా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే పని చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 50 రోజుల్లోనే అపరిమితంగా అప్పు చేసిందని అయినా పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.

టీడీపీ ప్రభుత్వం ఈ 50 రోజుల్లో చేసిన అప్పును పరిశీలిస్తే గత జూన్ 20న రూ.2 వేల కోట్లు, జులై 2న రూ.5వేల కోట్లు, జులై 16న మరో రూ.2వేల కోట్లు అప్పు చేసింది. ఈ విషయాన్ని ఎల్లో మీడియా బయట పెట్డదు. వీటితో పాటు తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. అయినా ఈ విషయం మనకి ఎక్కడా కనిపించదు. ఈ వారం రూ.3వేల కోట్ల అప్పు తీసుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఇందులో రూ.వెయ్యి కోట్లను పదిహేనళ్ల పరిమితి, మరో వెయ్యి కోట్లు 20ఏళ్ల పరిమితి, మరో వెయ్యి కోట్లు 25 ఏళ్ల కాల పరిమితితో చెల్లించేందుకు రిజర్వ్ బ్యాంకు ఓకే చెప్పింది. అప్పులు తీసుకోవడం నిత్యకృత్యం అయినా.. వైసీపీ చేస్తే భూతద్దంలో పెట్టి చూపించే ఎల్లో మీడియా.. దీనిని మాత్రం ఆవగింజత పరిమాణంలో కూడా చూపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: