జగన్‌: వామ్మో ఇదేందయ్యా ఇది.. ఎల్లో మీడియా కూడా మెచ్చుకుంది?

Chakravarthi Kalyan
ఏపీ రాజకీయాల్లో ఎల్లో మీడియాది ప్రత్యేక వ్యవహారశైలి. తమ ప్రియ తమ నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికే అవి పనిచేస్తున్నాయేమో అనిపిస్తోంది. అధికార వైసీపీని గద్దె దించి.. టీడీపీని ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు చంద్రబాబు కన్నా ఎక్కువ కష్టపడుతున్నాయి ఆ పత్రికా యాజమాన్యాలు.

అయితే రాజకీయ నాయకులు యూ టర్న్ లు తీసుకోవడం మనం చూస్తుంటాం. ఇది సహజం. చంద్రబాబు కోసమే యూ టర్న్ అనే పదం పుట్టిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన వెనక్కి తీసుకున్న యూ టర్న్ లో ఏపీ లో మరే నేత తీసుకోలేదంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు ఈయన అడుగు జాడల్లోనే టీడీపీ అనుకూల మీడియా పనిచేస్తోంది. వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను ఆది నుంచి తప్పుపట్టిన ఆ మీడియా.. వీళ్లు ఏ చిన్న తప్పిదం చేసినా.. వెంటనే భూతద్దంలో పెట్టి చూపిస్తూ దానిని సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి ఆపాదించేవారు.

అప్పుడు వాలంటీర్, సచివాలయ వ్యవస్థ  తప్పని రాసిన ఎల్లో మీడియా.. ఇప్పుడు ఇవే గొప్ప వాటిగా చిత్రీకరిస్తున్నారు.  గతంలో ప్రభుత్వ ఉద్యోగులను సీఎం జగన్ చిన్న చూపు చూస్తున్నారు. పనిలో వేధిస్తున్నారు అంటూ పుంఖానుపుంఖాలు వార్తా కథనాలు రాసుకొచ్చారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు తాజాగా మరో వార్తా కథనాన్ని రాసుకొచ్చింది. ఇందులో ఏముంది అంటే.. సీఎం కార్యాలయం నేరుగా జోక్యం చేసుకొని ఉద్యోగుల్లో ఎవరిపై అయితే విజిలెన్స్ తనిఖీలు ఉన్నాయో.. వారందరికి  క్లీన్ చిట్ ఇచ్చేలా చేసింది. తిరిగి వారందర్నీ ఉద్యోగంలోకి తీసుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి నుంచి కాపాడుతోంది అని అర్థం వచ్చేలా కథనం ప్రచురించింది. అంటే సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉన్నారనేగా అర్థం. వారు అడిగిన పనులు చేసి పెడుతున్నారు అని చెప్పకనే చెప్పారు. చంద్రబాబు కి మేలు చేద్దామనే
 ఉద్దేశంతో వైసీపీకి ఊతం ఇచ్చేలా కథనాలు రాస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: