పచ్చ మీడియా స్టోరీల వెనుక ఉన్నది అతనేనా?

Chakravarthi Kalyan
ఉమ్మడి కడప జిల్లా మంగంపేట బైరైటీస్ గనుల్లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఎంత దోచుకున్నా.. ఏమీ కాదన్న ధీమాతో గనుల శాఖలో గజ దొంగలు రెచ్చిపోతున్నారు. కంచే చేను మేసిన చందంగా బైరైటీస్ ను కొల్లగొడుతున్నారు. పట్టా భూములు ఇచ్చిన నిర్వాసితుల పరిహారం కింద కేటాయించాల్సిన బైరైటీస్‌లోనూ అక్రమాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.

ఇది గత రెండు మూడు రోజులుగా మంగంపేట బైరైటీస్ గురించి ఎల్లో మీడియా రాస్తున్న తీరు. ఎందుకు మంగంపేట ను ప్రత్యేకించి వార్తలు రాస్తున్నారు అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే తాజాగా ఈ వార్తలను రాయించింది.. దీని వెనుక ఉన్నది బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు బయటకు వచ్చి నోరు విప్పారు కనుక ఈ విషయం తేటతెల్లమైంది. మొదట్లో టెండర్లు పిలవడం లేదు.. తమకు కావాల్సిన వారికి కట్టబెడుతున్నారు అని రాసుకొచ్చి.. ఆ తర్వాత టెండర్లు అప్రూవల్ అయిన తర్వాత అలా ఎలా ఇస్తారు అని వార్తలు రాసుకొచ్చారు.

తాజాగా దీనిపై ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. అరుదైన మంగంపేట బైరైటీస్ పై సీఎం జగన్ కన్ను పడింది. విక్రమ్ అనే వ్యక్తికి లీజుకిచ్చేందుకు టెండర్ ప్రక్రియను గోప్యంగా ఉంచారు. దీని పై న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తానని ఆయన ప్రకటించారు. గతంలో మూడు లేదా ఆరు నెలలకు ఓసారి టెండర్లను పిలిచేవారు.

ఇప్పుడు కూడా అదే విధానాన్ని అమలు చేయాలి. అవసరమైతే బైరైటీస్ వద్ద అన్నిపార్టీల నాయకులతో కలసి దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కేంద్ంలో మూడో సారి మోదీ అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పారు. ఏపీలో మాత్రం జగన్ ను ఎప్పుడు ఇంటికి పంపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఐదేళ్ల కాలంలో మేడా, మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, భారతీ రెడ్డి సిఫార్సు చేసిన గుత్తేదారులకు మాత్రమే బిల్లులు చెల్లించారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: