పవన్, బాబు లెక్కల్లో బిగ్‌ ట్విస్ట్‌?

Chakravarthi Kalyan
రిపబ్లిక్ డే సందర్భంగా ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇందులో భాగంగా మండపేట, అకు స్థానాలను పొత్తు ధర్మానికి విరుద్ధంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడాన్ని పవన్ తప్పుపట్టారు. అందుకే తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తానని చెప్పి రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించారు. దీంతో వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. వీరి పొత్తుకు బీటలు వారుతున్నాయనే చర్చ కూడా మొదలైంది.

ఇదే సందర్భంలో 175 స్థానాల్లో మూడో వంతు సీట్లు కనీసం 60కి తగ్గకుండా పవన్ అడిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు పవర్ షేరింగ్ విషయంలోను వెనక్కి తగ్గనన్నట్లు తెలిసింది.  అయితే ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది.   అదేంటంటే పవన్ మూడో వంతు సీట్లు అన్నది అసెంబ్లీ ఎన్నికల్లో కాదని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలనుద్దేశించి అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో ఏముంది అంటే.. మనం ప్రజలకు ఎలాంటి పాలసీలు అందించాలి. ఎలాంటి భవిష్యత్తును వారికి చూపించాలి అనేది కామన్ మినిమం ప్రోగ్రాం కిందకి వస్తుంది. కామన్ పొలిటకల్ ప్రోగ్రాం కింద లోకల్ బాడీలు, పరిషత్లు, పంచాయతీ లు మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన కచ్ఛితంగా మూడో వంతు సీట్లు తీసుకుంటుంది అని పేర్కొన్నారు.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ ప్రతిపాదనను టీడీపీ ఒప్పుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం అసెంబ్లీకి మూడో వంతు సీట్లు అడిగారా లేదా అనేది అర్థం కానీ అంశం. ఇది ఎలా ఉందంటే గతంలో జగన్ ప్రస్తుతం రెండు వేల రూపాయల పింఛన్ ను పెంచుకుంటూ పోయి రూ.3000 చేస్తానని చెప్పాడు. ఇది చాలామందికి అర్థం కాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగితే ఆయన మాట్లాడిన క్లిప్పింగ్ ను వినిపించారు. పెంచుకుంటూ అన్నారు కానీ ఎంత నుంచి అనే విషయం అందులో లేదు. ఇప్పుడు కూడా మూడో వంతు సీట్లు అన్నారు కానీ అందులో అసెంబ్లీ ఉందా లేదా అనేది స్పష్టం చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: