రహస్యం: ఇరాన్‌తో కలసి దొంగాట ఆడుతున్న చైనా?

Chakravarthi Kalyan
యెమెన్ కు చెందిన హౌతీ తిరుగుబాటు దారులు కొంతకాలంగా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ఎర్ర సముద్రంలో ఈ దాడులను నిలువరించడానికి ఇరాన్ ను చైనా హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. చైనా ప్రయోజనాలకు ఈ విధంగా అయినా హాని కలిగితే ఆ ప్రభావం టెహ్రాన్ తో ఉన్న వ్యాపార సంబంధాలపై పడుతుంది.

అందుకే సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి అని డ్రాగన్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ నౌకలపై వరుస దాడులు చోటు  చేసుకున్నాయి. ఇజ్రాయెల్ కు వెళ్లే.. అక్కడి నుంచి వచ్చే నౌకలు లేదా.. ఇజ్రాయెల్ కు సంబంధం ఉన్న నౌకలను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీ రెబల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ కు వస్తున్న ఓ నౌకను హైజాగ్ చేయడంతో పాటు భారత్ లో తయారైన జెట్ ఇంధనాన్ని తీసుకు వెళ్తున్న హార్డ్ మోర్ అనే నౌకపై దాడికి యత్నించారు.

పశ్చిమాసియా, ఐరాపా మధ్య ఉన్న కీలక వాణిజ్య మార్గంలో ఎర్ర సముద్రం ఉంది. అంతర్జాతీయ సాగర వాణిజ్యంలో 12 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. చమురు, సహజవాయువు, ఎలక్ర్టానిక్ వస్తువుల వరకూ అనేకం రవాణా అవుతూ ఉన్నాయి. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడంతో అంతర్జాతీయ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఫలితంగా అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గాన్ని వీడుతున్నాయి. ఈ సమయంలో చైనా నుంచి హెచ్చరిక వచ్చింది. అయితే టెహ్రాన్ తో తమ సంబంధాలు ఎలా ప్రభావితం అవుతాయో చైనా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇరాన్ వర్గాలు తెలిపాయి. దశాబ్ద కాలంగా ఆ దేశానికి డ్రాగన్ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. గతేడాది ముడి చమురును ఎగుమతుల్లో 90శాతానికి చైనానే కొనుగోలు చేసింది. అయితే ఈ విషయంలో ఇరాన్ కు చైనా ఏదో సందేశం ఇచ్చింది అనే వార్త ఇప్పుడు అంతర్జాతీయ మీడియలో వైరల్ అవుతోంది. కాకపోతే అది ఏంటి అనేది తెలియరావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: