పురందేశ్వరిలో ఎంత మార్పు వచ్చిందో?

Chakravarthi Kalyan
భారతీయ జనతా పార్టీ  ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైన పార్టీలు అనేటువంటి టిడిపి అలాగే వైసిపి పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడలేకపోయింది. అలాగే అటు తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కూడా ప్రత్యామ్నాయ పార్టీగా  నిలబడలేకపోయింది. దానికి ప్రధానమైన కారణం స్వయాన భారతీయ జనతా పార్టీ కి సంబంధించిన అధిష్టానమే అంటారు. అధిష్టానంలో ఉన్న కొంతమంది అస్పష్టతే దీనికి కారణమని తెలుస్తుంది.

వారి లోని కొంతమంది తమ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో సంబంధం ఉన్నట్లుగా చెప్పుకొస్తున్నారట. మరి కొంతమంది తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లబోతున్నాం అని సూచనలు ఇస్తున్నారట. దానితో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారే విషయంలో భారతీయ జనతా పార్టీ తడబడుతుందని అంటున్నారు. సోము వీర్రాజు  బిజెపి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రెండు పార్టీలనూ విమర్శిస్తూ ఉండేవారు. దానితో ఆయన తటస్థ భావంతో ఉన్నట్లు కనిపించేది.

కానీ తెలుగుదేశం పార్టీ వాళ్లు వేసినటువంటి ట్రాప్ లో చిక్కుకొని ఆయన వైసీపీ ముద్రను వేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బిజెపికి సంబంధించిన పురందేశ్వరి దేవి పై తెలుగుదేశం ముద్రను వేస్తున్నారు వైసిపి వాళ్ళు. ఆవిడ వైసిపి వాళ్ళను మాత్రమే విమర్శిస్తుంటే దానికి కౌంటర్ గా వైసిపి వాళ్ళు కూడా ఆమెను విమర్శిస్తున్నారు. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమెకు సపోర్టుగా వైసిపి వాళ్లను విమర్శించడంతో ఈ ముద్ర నిజమవుతుంది.  

గతంలో ఇదేవిధంగా పవన్ కళ్యాణ్ ని వైసిపి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మనిషి అని విమర్శించడం జరిగింది. దానికి టిడిపి వాళ్ళు కూడా అవును అని సమాధానం ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక ఉనికిని కోల్పోవడం జరిగిందని అంటారు. అయితే తాజాగా విశాఖకు మరొక మెడికల్ కళాశాలను కేంద్రం మంజూరు చేస్తే దానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు అంటూ పురందేశ్వరి దేవి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకుని వైసీపీకి చెందిన సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు వీరిని టార్గెట్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: