రష్యా సరిహద్దుల్లో అమెరికా సైన్యం అరాచకం?
దీంతో పశ్చిమ దేశాలు మరోసారి ఉక్రెయిన్ పై దృష్టి సారించాయి. పోతున్న పరువును నిలబెట్టుకునేందుకు కొత్త ఎత్తులను వేస్తున్నాయి. గతం కంటే ఎక్కువగా సైనికులను, క్షిపణులను సమకూర్చాలని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. అయితే రష్యా ఏదైతే జరగకూడదని అనుకుందో అదే జరిగేలా కనిపిస్తోంది. నాటో, యూరప్, అమెరికా దేశాల సైన్యం తమ సరిహద్దుల్లోకి రాకూడదని రష్యా భావించింది.
ఉక్రెయిన్ ను యూరోపియన్ లో కానీ, నాటో లో కానీ భాగస్వామ్యం చేసుకుంటే ఆయా దేశాల సహకారంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది. పశ్చిమాసియా దేశాలు రష్యాకు ఆనుకొని ఉన్నాయి కాబట్టి రష్యాకు పెద్ద ఎదురు దెబ్బే తగిలే అవకాశం ఉంది. యుద్ధం జరుగుతున్న సమయంలో నాటో లో కానీ, యూరోపియన్ లో కానీ చేర్చుకోమని చెప్పిన దేశాలు ప్రస్తుతం ఉక్రెయిన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇది ఒకవేళ యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే తమ పరువు పోతుందని భావించాయి.
దీనికోసం కొత్త ఎత్తులను వేస్తున్నాయి. రష్యన్ సైన్యం పోలండ్ ను అడ్డు పెట్టుకొని పశ్చిమాసియా దేశాల సరిహద్దుల వరకు వచ్చింది. ఒకవేళ ఉక్రెయిన్ ఓడిపోతే రష్యా సత్తా పెరుగుతుంది. రష్యా నుంచి విడిపోయిన దేశాలన్నీ తిరిగి తమ దేశంలో కలుపుకునేందుకు పుతిన్ ప్రయత్నిస్తారు. దీనిని నియంత్రించాలని నాటో భాగస్వామ్య దేశాలు తమ సైన్యంలోకి అమెరికా సైన్యాన్ని పంపిచాలని అగ్రరాజ్యంతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగా అమెరికా సైన్యం రష్యా సరిహద్దుల్లోకి వచ్చి చేరుతోంది. దీనికి ప్రతీకారంగా క్రెమ్లిన్ అమెరికా, ఇతర దేశాలపై యుద్ధం చేస్తుందా లేదా చూడాలి.