కొత్త సర్వే.. ఏపీ ఎన్నికల్లో గెలిచేది ఆయనే?
తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధ దాస్ ప్రజల వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు. అందుకు తగ్గట్లుగానే అక్కడి ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలను ఆయన బయట పెట్టారు. వైసీపీకి 46శాతం ప్రజల మద్దతు ఉందని ప్రకటించారు. అలాగే ప్రతిపక్ష టీడీపీకి 40 శాతం, జనసేనకు 11 శాతం ఉన్నట్లు వెల్లడించారు. ఇతరులకు ఒక శాతం ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే టీడీపీ 40శాతం మద్దతులోనే జనసేనకు 11శాతం అని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల విషయానికొస్తే వైసీపీ కి 48శాతం, టీడీపీకి 43శాతం, జనసేనకు 8శాతం ప్రజలు మద్దతు తెలిపారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒక శాతం మాత్రమే ఉందన్నారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై కూడా ప్రజాభిప్రాయాన్ని వెల్లడించారు. సీఎంగా జగన్ ను 46శాతం ప్రజలు కోరకుంటున్నారని.. చంద్రబాబుకు 36 శాతం ప్రజలు అండగా ఉన్నారన్నారు. నారా లోకేశ్ కు 8 శాతం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 10 శాతం ప్రజల మద్దతు ఉందన్నారు. ఆయన ఏపీలోని రాజమండ్రి సిటీ, శ్రీ కాళహస్తి, పెదకూరపాడు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో ఈసర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. చూద్దాం తెలంగాణ మాదిరిగా ఏపీలో కూడా ఆయన సర్వే ఫలితాలు నిజం అవుతాయే లేక గురి తప్పుతాయో.