బాబు పరేషాన్‌: పవన్ 60 సీట్లు అడుగుతారా?

Chakravarthi Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి శ్రేయోభిలాషిగా పెద్దాయనగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య తరచూ సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఆయన ఇంతకీ జనసేనలో ఉన్నారా అంటే లేరు. కానీ ఆయన జనసేన గెలవాలని పవన్ కల్యాణ్ సీఎం కావాలని బలంగా కోరుకంటుంటారు. ఆ మాటకు వస్తే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచి మెగాస్టార్ సీఎం కావాలని ఆయన కోరుకున్నారు.


అయితే ఇటీవల జనసేనలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా జనసేనలో జోష్ తగ్గింది. కొన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పెద్దాయన హరిరామ జోగయ్య బయటకి వచ్చారు. పవన్ కు క్యాడర్ కి మధ్య ఏర్పడిని ఒక విధమైన అభిప్రాయ భేదాలను ఒక ప్రకటన రూపంలో తీసుకువచ్చారు.


అధికారంలోకి రావాలని జనసేన క్యాడర్ ఆలోచిస్తోంది. పవన్ మాత్రం ఓటేయాలని అంటున్నారు. రెండూ ముఖ్యమే అని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. పొత్తులో భాగంగా 60 సీట్లు తీసుకుంటే జనసేన నెగ్గే పరిస్థితి కనిపిస్తోందని భరోసా ఇచ్చారు. టీడీపీ వెంట జనసేన అన్నట్లుగా కాకుండా జనసేన వెంట టీడీపీ అనే భావన కలిగించాలని ఆయన సూచించడం విశేషం.


అదే జరిగితే కచ్ఛితంగా మూడు నెలల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని జోస్యం చెప్పారు. అధికారం దక్కించుకోవడం కోసం పవన్ కూడా కృషి చేయాలని కోరారు. అంటే అరవై సీట్లు కనుక జనసేన కు ఇస్తే కచ్ఛితంగా పవర్ షేరింగ్ తప్పనిసరి అప్పుడే టీడీపీ రెండేళ్ల పాటు అయినా జనసేనకు అధికారాన్ని ఇస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. మొత్తానికి జోగయ్య పవన్ మాటను నెగ్గిస్తూనే క్యాడర్ కోరుకుంటుంది కూడా పవన్ వినాలని తన మాటగా చెప్పేశారు. ఈ పెద్దాయన అంటే పవన్ కి గౌరవం ఉంది. మరి ఆయన చెప్పిన మాట ఇచ్చిన సందేశం పవన్ వింటారా లేదా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: