ఆ ఒక్క ముస్లిం దేశం.. హమాస్ను నిలదీసింది?
ఆ దుష్కృత్యాలను వీడియోలు తీసి శునకానందం పొందారు. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా తలలు నరికారు. ఇది చాలదన్నట్లు అక్కడ ఉన్న సాధారణ ప్రజలను బందీలుగా తీసుకువెళ్లారు. దీంతో కోపోద్రిక్తమైన ఇజ్రాయెల్ ప్రతిగా ఆ పాలస్తీనా పై విరుచుకుపడుతోంది.
శరణార్థి శిబిరాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు తమకు అనుమానం వచ్చిన ప్రతి ప్రదేశాన్ని ధ్వంసం చేస్తోంది. గాజాను రెండు భాగాలుగా విభజించి హమాస్ తీవ్రవాదులను సమూలంగా అంతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు పాలస్తీనా పౌరులకు భద్రత లేకుండా పోయింది. వరుస దాడుల కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అయితే వీరిని అడ్డు పెట్టుకొని హమాస్ తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను అరబ్ దేశాలు ఖండిస్తున్నాయి. దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. అయితే బెహ్రాయిన్ దేశం మాత్రం అరబ్ దేశాలకు విభిన్నంగా స్పందించింది. ఆ దేశ ప్రధాని సల్మాన్ బిన్ హమాద్ ఖలీఫా ఈ ఉదంతంపై మాట్లాడుతూ హమాస్ తీవ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. అమాయకులపై ప్రజలపై ఈ తరహా దాడులు ఎలా చేస్తారని హమాస్ తీవ్రవాదులను ప్రశ్నించారు. ఈ తరహా దాడులు సహేతుకం కాదు అని స్పష్టం చేశారు. ఇలాగే 57అరబ్ దేశాలు ఖండిస్తే ఉగ్రవాదంపై పోరు మరోలా ఉంటుంది. ఇప్పటికి అయినా స్పందిస్తారు ఏమో చూడాలి.