అమెరికాలో ఇజ్రాయెల్‌ పాలస్తీనా వార్‌?

Chakravarthi Kalyan
భావ ప్రకటనా స్వాతంత్ర్యపు హక్కు చాలా కీలకమైన అంశం. దీనిని అడ్డు పెట్టుకొని మనదేశంతో పాటు అమెరికాలో కూడా కొందరు విద్వేషాలకు పాల్పడుతుంటారు. అగ్రరాజ్యంలో దీనిని అడ్డు పెట్టుకొని హమాస్ మద్దతుదారులు వైట్ హౌస్ గోడలెక్కారు.  యుద్ధ నౌకలు అడ్డుకున్నారు. దాదాపు వేలమందితో గాజాలో జరుగుతున్న మారణహోమానికి బైడెనే కారణమని ఆరోపించారు. బైడెన్ బైడెన్ నువ్వు ఎక్కడా దాక్కోలేవు అంటూ బిగ్గరగా నినదించారు.


హమాస్ మద్దతు దారులు పాలస్తీనా కు మద్దతు పేరుతో ఇదంతా చేశారు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి హమాస్ అంటే పాలస్తీనీయన్లకు రక్షణ కవచం వంటి  వారని వారు తల్లిదండ్రులు తమ పిల్లలకు నూరిపోస్తుంటారు. అలా బోధించకపోతే తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని హమాస్ తీవ్రవాదులు చంపేస్తుంటారు. అందుకే వాళ్లు అలా చేస్తారు. అలా తయారైన వీళ్లు ఉన్మాదంతో హమాస్ తీవ్రవాదులు ఏం చేసినా పాలస్తీనాకు మంచి చేకూర్చేందుకే అనే భావనలో ఉంటారు. అందుకనే హమాస్ కి మద్దతుగా అమెరికా లో ర్యాలీలు తీస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు.


అమెరికాలో కేవలం పాలస్తీనీయన్లే ఉన్నారా.. ఇజ్రాయెలీలు లేరా అనే సందేహం వస్తోంది కదా.. అయితే అమెరికాలోని యూదుల్ని లక్ష్యంగా చేసుకొని కొంతమంది కాల్పులు జరిపారు. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెలీలు దాదాపు మూడు లక్షల మందితో పక్కా ప్రణాళికతో  పెను ఉద్యమం చేశారు.


అనుకోని ఘటనతో అగ్రరాజ్యం అవాక్కైంది. మన దేశంలో ఇంతమంది ఇజ్రాయెలీలు ఉన్నారా అనే ప్రశ్న వారిలోనే తలెత్తింది. మరోవైపు అమెరికాలోని అన్ని విభాగాల్లో, రంగాల్లో ఇజ్రాయెలీలదే ఆధిపత్యం. యూధులదే అద్భుతమైన ప్రతిభావంతులు. దాదాపు కీలక రంగాల్లో వారిదే పైచేయి. దీనిని వాళ్లు చాలా సార్లు నిరూపితం చేసుకున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అమెరికా స్పీకర్ బయటకి వచ్చి ఇజ్రాయెల్ కి మద్దతు తెలిపారు. ట్రంప్ పార్టీ రిపబ్లికన్ సభ్యులు కూడా ఇజ్రాయెలీలకు అనుకూలంగా మాట్లాడారు. అమెరికన్లను కూడా ఇజ్రాయెల్ పట్ల సానుకూలంగా మార్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: