ఉపాధి హామీ: జగన్ సర్కారు కీలక నిర్ణయం?

Chakravarthi Kalyan
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే సామెత ఒకటుంది. అలాగే అందుకు అనుగుణంగా ఏపీలోని జగన్ సర్కారు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనిని ఎల్లో మీడియాలో నెగిటివ్ గా ప్రచారం చేసినా లబ్ధిదారులకు మాత్రం ఈ నిర్ణయం ఉపయోగకరంగానే ఉంటుంది. ముందుగా ఎల్లో మీడియాలో రాసిన కథనాన్ని తీసుకుంటే.. సర్పంచులకు ప్రభుత్వం మరో షాక్. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పనిచేసిన ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయకులు ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహించనున్నారు.


ఇందుకోసం ప్రతి సచివాలయంలో వీరు  కూర్చొనేందుకు కుర్చీ, రికార్డులు భద్రపరిచేందుకు తగిన వసతి కల్పించాలని ఆదేశించింది. ఉపాధి హామీ పనులు ప్రతిపాదించడం దగ్గర నుంచి చేయించడం వరకు వీరి పాత్ర కీలకం. ఉపాధి పనులు ఆమోదించే గ్రామ సభకు ఛైర్మన్ సర్పంచి కావడంతో ఆయన ఆధ్వర్యంలోనే వీరతా పనిచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఉపాధి సిబ్బందిని సర్పంచుల దగ్గర నుంచి దూరం చేసిందని వార్త రాసుకొచ్చింది.


వాస్తవానికి ఉపాధి హామీ పనులను రాజకీయంగా ముడి పెట్టడం మూలంగానే ఆ పథకం ఉద్దేశం నీరుగారిపోతుందని పలువురు విమర్శిస్తున్నారు. అసలు ఈ పథకం ముఖ్య ఉద్దేశం పని లేని కూలీలకు ఉపాధి చూపించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం. అయితే ఉపాధి హామీ పథకంలో సాధారణ మస్టర్ విధానంతో డబ్బులు చెల్లించేవారు. ఇందులో అక్రమాలు వెల్లువెత్తడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక నుంచి నేరుగా కూలీల ఖాతాకు నగదు జమ సేసే విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకువస్తోంది.


నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ద్వారా జియో ట్యాగ్ ఆధారంగా ఫొటోలు అప్ లోడ్ చేస్తే ఆన్ లైన్ లో హాజరు వేస్తారు. అనంతరం డెరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ ఫర్ ద్వారా నగదు కూలీల ఖాతాలో జమ చేస్తారు. ఈ విధానంలో ఒకరి బదులు మరొకరు పనికి హాజరుకావడం పనికి రాకుండా హాజరు వేసే అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. ఇది చాలా మంచి ఆలోచన. ఏదైనా తేడా జరిగితే సచివాలయం దగ్గరే వాళ్లని నిలదీయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: