కేజ్రీవాల్ కూడా అందరిలాంటివాడేనా?

Chakravarthi Kalyan
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ  ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకు పోయింది. దీని నుంచి బయటపడడానికి అది చేస్తున్న ప్రయత్నాలు  మిగతా రాజకీయ పార్టీల లాగానే కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వ్యతిరేక కార్యకలాపాలు నిర్మిస్తున్న ప్రజా ప్రభుత్వాలపై వ్యతిరేకంగా పోరాడి ఏర్పడింది. ఆ పార్టీ లక్ష్యం అవినీతి ని రూపు మాపి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని ప్రకటించారు.


అదే పార్టీలో ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత  మనీష్ సిసోడియ ఢిల్లీ లిక్కర్స్ స్కాం కేసులో అరెస్టు అయి జైలు జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఈడి నోటీసులు పంపింది. దీనికి సంబంధించి అరవింద్ ను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నట్టు వార్తలు రావడంతో హుటాహుటిన ఢిల్లీలోని ఆ  ప్రభుత్వం సమావేశమైంది.


ఒకవేళ సిఎం ను అరెస్టు చేస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విధానంపై తీవ్రంగా చర్చలు సాగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్  కేసులో  సిసోడియా జైలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈడి ఢిల్లీ సిఎం ను అరెస్టు చేయడానికి సిద్ధం కావడంతో ఆయన భార్యని ఢిల్లీ సీఎంగా ఉంచేందుకు పావులు కదుపుతున్నారు.  అయితే దీనిపై రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ సాగుతుంది. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుపరిపాలన అందిస్తామని చెప్పినటువంటి ఆప్ పార్టీ ప్రస్తుతం అదే అవినీతిలో కూరుకుపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.


అన్నా హజారే టైంలో  కాంగ్రెస్ అవినీతిపై వ్యతిరేకంగా పోరాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మాణం జరగటం న్యూఢిల్లీలో ఎక్కువ మందికి అది తొందరగా రీచ్ కావడం జరిగింది. అలాంటి పార్టీలో  ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , మాజీ ఐఏఎస్ అధికారి కూడా అక్రమాస్తుల కేసులో ఈడి నోటీసులు అందించి అరెస్టు చేయనున్నట్లు వార్తలు రావడం కలవర పరిచే విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: