రష్యా సైన్యం.. పుతిన్‌ మాట వినడం లేదా?

frame రష్యా సైన్యం.. పుతిన్‌ మాట వినడం లేదా?

Chakravarthi Kalyan
యుద్ధంలో పరాజితులే కానీ విజేతలెవరూ ఉండరని టాల్ స్టాయ్ తన వార్ అండ్ పీస్ నవలలో ఎప్పుడో చెప్పారు. చరిత్ర దానిని చాలాసార్లు రుజువు చేసింది కూడా.  ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో రష్యా మొదలు పెట్టిన దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 20 నెలలుగా ఈ పోరు జరగుతోంది. దీనికి ముగింపు ఇప్పట్లో ఉండేలా లేదు.

ఈ యుద్ధ నేపథ్యంలో ఇరు దేశాలు కూడా భారీ ఎత్తున ఆయుధ సామగ్రి కోల్పోతున్నాయి.  తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి.  ఉక్రెయిన్ వద్ద ఉన్న ఆయుధాలన్నీ దాదాపుగా అయిపోయాయి. నాటో దేశాలు కూడా ఆయుధ సామగ్రి అందించేందుకు ముందుకు రావడం లేదు. ప్రజల కూడా దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో రష్యా ఉక్రెయిన్ ను ఎందుకు ఆక్రమించుకోలేపోతుందనే సందేహాలు పలువురి లో వ్యక్తమవుతున్నాయి.

జెపోరిజియా, కేర్సన్, డొనేట్స్ లోని 70-80శాతం ఆక్రమించుకున్న క్రెమ్లిన్ మిగతా భాగం ఎందుకు పూర్తి చేయలేకపోతుంది. రష్యా కూడా ఆయుధాల కొరత, ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు కనిపిస్తోంది. రెండోది దేశం నియంత్రణలో ఉందా లేదా.. అనే సందేహాలను పలువురు మేధావులు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే డాగేస్థాన్ విమానాశ్రయంలో ఆగిన ప్రయాణికులపై ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఏకంగా అల్లాహు అక్బర్ నినాదాలు చేస్తూ విమానాశ్రయంలోకి వెళ్లి ఇజ్రాయెలీల పాస్ పోర్టు పరిశీలించారు.

వీరిలో కొంతమంది తుపాకీలు, ఇతర ఆయుధాలను కలిగి ఉన్నారు. ఏకంగా విమానాన్నే ధ్వంసం చేయాలని చూశారు. ఈ పరిణామాలు చూస్తే అక్కడ పరిస్థితులు నియంత్రణలో లేనట్లు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం ఏంటంటే పుతిన్ ఆదేశాలను అక్కడి సైన్యం పాటించడం లేదు. ఎందుకంటే సైన్యానికి జీతాలు ఇవ్వడం లేదు. కేవలం ఆహార పదార్థాలనే ఇస్తున్నారు. వీరితో పాటు పోలీసులు, ఇతర రక్షణ సిబ్బందికి జీతాలు నిలిచిపోయాయి. దీంతో వారంతా అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా అమెరికా సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. దీనతంటికి మూల కారణం సైనికచర్యే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: