రష్యా సరిహద్దుల్లోకి అమెరికా అణుబాంబులు?
ఈ యుద్ధం గురించి ఇప్పుడిప్పుడే జనం మరచిపోతున్నారు. ఈ తరుణంలో ఉక్రెయిన్ రష్యాపై భారీ దాడులనే కొనసాగిస్తోంది. రష్యాకు సంబంధించిన 14 దళాలపై ఎటాక్ చేసింది. హెలీకాప్టర్ లను ధ్వంసం చేసింది. భారీగానే విధ్వంసానికి పాల్పడుతోంది. రష్యా కూడా గట్టిగానే ప్రతిఘటిస్తున్నా.. క్రెమ్లిన్ తమ తదుపరి అస్త్రం అణుబాంబు దాడికి సిద్ధమవుతోందనే ప్రచారం గట్టిగానే వినిపిస్తోంది.
ఉక్రెయిన్ యుద్ధంలో మరింత పట్టు సాధించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే ఆయుధాలను సమకూర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఇరాన్, ఉత్తర కొరియా, చైనా లాంటి దేశాలతో పుతిన్ చర్చలు జరిపారు. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న కామికేజ్ డ్రోన్ల సాయంతో రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఆయుధాలను, సామగ్రిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలతో రష్యా రహస్య సంప్రదింపులు జరుపుతోంది.
అయితే తమ దేశం జోలికి వస్తే అణుబాంబును ప్రయోగించడానికి సిద్ధమేనని బెలారస్ నాటో దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. బెలారస్ పుతిన్ చెప్పు చేతల్లో ఉంటుందని నాటో దేశాల భావన. దీనికి అనుగుణంగా ఉక్రెయిన్ కూడా సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఆ దేశానికి అమెరికా పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని సరఫరా చేస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన న్యూక్లియర్ బాంబర్ రష్యా సరిహద్దుల్లోకి చేరుకుంది. రెండు యుద్ధ విమానాలు అమెరికా నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రాంతంలోకి వచ్చినట్లు మా దృష్టికి వచ్చిందని రష్యా పేర్కొంది. దర్యాప్తు కు ఆదేశించగా మా సుఖోయ్ వెళ్లి విచారణ చేపట్టింది. రెండు అణ్వస్త్ర బాంబులు తమ సరిహద్దుల్లో ఉన్నట్లు రష్యా తెలిపింది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది.