ఇజ్రాయెల్ గాజా మీద అణు బాంబు వేస్తుందా?
దీంట్లో నెస్సెట్ డ్రోన్లు, వెపన్లు వాడాలని ఆమె కోరింది. గాజా మొత్తం బూడిద అయిపోవాలి. ముఖ్యంగా హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడుల్లో 40 మంది చిన్న పిల్లల తలలు నరికి అతి కిరాతకంగా చంపేశారు. ఇలా చేయడం వల్ల ఇజ్రాయిల్ లో ప్రతి ఒక్కరు ప్రతీకారంతో రగిలిపోతున్నారు.
ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ ను పురుగును నలిపేసినట్లు నలిపేస్తామని హెచ్చరించారు. హమాస్ అనేది ఒకప్పుడు ఉండే తీవ్రవాద సంస్థ అని చెప్పేలా చేస్తామని ప్రకటించారు. గాజా లో కూడా బీభత్సంగా బాంబు దాడులు జరుగుతున్నాయి. అక్కడ కరెంట్, నీటి సఫ్లై బంద్ చేసిన ఇజ్రాయిల్ సరిహద్దులను కూడా మూసేసి ఉగ్రవాదుల భరతం పట్టే పనులకు పూనుకుంది.
అయితే ఈ సారి క్షేత్ర స్థాయిలో దాడులకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఇది రిస్క్ తో కూడుకున్న పని. గాజా సిటీలో అత్యంత తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది జీవిస్తుంటారు. సామాన్య ప్రజల్ని ఇజ్రాయిల్ ప్రభుత్వం హెచ్చరించి 24 గంటల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. భూతల దాడులకు సిద్ధమవుతున్న వేళ రాబోయే రోజుల్లో గాజా పరిస్థితి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఇప్పటికే చాలా మందికి తిండి, నీరు దొరక్క అల్లాడుతున్నారు. ఉగ్రవాదుల చెర నుంచి ఇజ్రాయిల్ బందీలు విడుదలయ్యేంత వరకు కరెంట్, నీటిని ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.