విదేశాల్లో పవన్‌ పెట్టుబడులు.. కేంద్రం వద్ద సమాచారం?

Chakravarthi Kalyan
నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది. ఒకే విషయాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల దీనిని జనం నమ్ముతారు అనేది వీళ్ల అభిప్రాయం కావొచ్చు. కానీ ఇలా ప్రతి సారి ఒకే తరహా నిరాధార ఆరోపణలు చేయడం వల్ల జనాల్లో ప్రతిపక్ష నేతలకు మైలేజ్ పెరగడమే కాకుండా వీళ్ల గ్రాఫ్ కూడా పడిపోతుంది. కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కల్యాణ్ ని విమర్శిస్తూ ఇటీవల ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  

పవన్‌ ఒక ప్యాకేజీ స్టార్ అని.. ఇప్పటి వరకు రూ.1400 కోట్లు ప్యాకేజీ తీసుకున్నాడని ఆరోపించారు.  అంతేకాకుండా  రాజకీయ పొత్తులో భాగంగా ఈ సొమ్ము అందుకున్నారని.. ఈ మొత్తాన్ని హవాలా రూపంలో సింగపుర్, దుబాయ్, రష్యా వంటి దేశాలకు పంపిచారని తెలిపారు. ఈ ఆరోపణలపై తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్రం వద్ద ఉందని వివరించారు. పవన్ కల్యాణ్ కు దమ్ము ఉంటే కాకినాడలో గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుని బీజేపీని కలుపుకొని వెళ్తామని చెప్పడం వెనుకు పెద్ద స్కెచ్ ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేయకుంటే ఆ క్షణమ పవన్ ఓటమి ఒప్పుకున్నారని తాను భావిస్తానన్నారు.  ఇది తెలివైన ఎత్తుగడ గా భావించవచ్చు. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. కానీ పవన్ గాజు గుర్తుపై పోటీ చేస్తే తాను విజయం సాధిస్తారనేది ఆయన వ్యూహం కావొచ్చు.

అయితే ప్యాకేజీ రూ.1200 కోట్లు అని ఆరోపణలు చేసేటప్పుడు అధికారంలో ఉంది వైసీపీనే కాబట్టి ఆయన్ను అరెస్టు చేయవచ్చు కదా..  మరో ముఖ్యమైన విషయం వివరాలు కేంద్రం వద్ద ఉన్నాయని చెప్పడం ఒకవేళ ఉంటే ఆ విషయం ఈయనకు పిలిచి చెప్పారా.. వీళ్లు చేసే ఆరోపణలకు కేంద్రానికి ఏం సంబంధం. ఇలా నిరాధార ఆరోపణలు చేస్తే జనం నమ్మడం సంగతి అటు ఉంచి.. నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: