మోదీ.. అందరినీ దూరం చేసుకుంటున్నారా?

Chakravarthi Kalyan
మోడీ జట్టు వీడిపోతున్నట్లు కనిపిస్తుంది. 2014లో బీజేపీ కంటే కాంగ్రెస్ కు ఏడు సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అప్పటి వాజ్ పేయి సారథ్యంలోని బీజేపీ అయినా ప్రతిపక్షాలను ఇతర పార్టీలను కలుపుకోలేక అధికారం చేజిక్కించుకోలేకపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరించి కేంద్రంలో అధికారం చేపట్టింది. కేవలం 7 ఎంపీ స్థానాలు ఎక్కువ వచ్చినా దేశంలోని వివిధ పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అయిదేళ్లు సమర్థవంతంగా పాలన కొనసాగించింది.

2009 సంవత్సరంలో రాహుల్ గాంధీని ఎలాగైనా పీఎం చేయాలనే ఉద్దేశంతో మరింత దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్ అధిష్టానం మిత్ర పక్షాలతో పాటు బీజేపీ అనుకూల పార్టీలను కూడా బెదిరిస్తూ కొనసాగింది. ముఖ్యంగా కాంగ్రెస్, డీఎంకే పార్టీకి చెందిన తన వారినే కొన్ని కేసుల్లో అరెస్టు చేయించి తమ పార్టీ అవినీతి విషయంలో ఏ మాత్రం సహించదని ప్రజల్లోకి సూచనలు తీసుకెళ్లారు.

అయితే ఈ విషయంలో కాంగ్రెస్ లోని కొంతమంది నేతలు, మిత్ర పక్షాలైన డీఎంకే లాంటి పార్టీలు కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉండే వారు. ఆ తర్వాత సొంత పార్టీలనే అసమ్మతి రాగంతో కాంగ్రెస్ 2014 లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా అచ్చం అలాగే కనిపిస్తుంది. ఎన్డీఏ లో ప్రధాన పార్టీ అయినా బీజేపీ తన మిత్ర పక్షాలను దూరం చేసుకుంటుంది. తెలుగు దేశం పార్టీ, శివసేన, జేడీఎయూ, జేడీఎస్ లాంటి పార్టీలు బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోయింది.

శివసేనలో షిండే వర్గం బీజేపీతో సఖ్యతగా ఉంటుండగా.. శివసేన ఠాక్రే వర్గం మాత్రం దూరంగా ఉంటోంది. 2014, 2019 సంవత్సరంలో పూర్తి మెజార్టీతో గెలిచిన బీజేపీ తనమీదే నమ్మకంతో మిత్ర పక్షాలకు పెద్దగా ప్రయార్టీ ఇవ్వడం లేదు. సొంతంగా దేశంలో గెలవాలని అనుకుంటోంది. దీంతో తమకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లేదని తమిళనాడులోని అన్నా డీఎంకే పార్టీ బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: