అమరావతి కుంభ కోణంలో నిజమెంత?

Chakravarthi Kalyan
కృష్ణా, గుంటూరు లు పురోగతి సాధిస్తూ రియల్ ఎస్టేట్ లో రాణిస్తున్న సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటించింది.  దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ పరుగు ఆగిపోయింది. పెట్టుబడులన్నీ అమరావతికి వచ్చి చేరాయి. ఆ కోపమే విజయవాడ గుంటూరులో టీడీపీ ఓటమికి కారణం అయింది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ అమరావతిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తున్నారు.  అమరావతిలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు.  దీన్ని సాంతం పక్కన పెట్టేశారు.  దీనికి ప్రత్యామ్నాయ ప్రణాళిక జగన్ సర్కారు వద్ద లేదు అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.  ఇప్పుడు అమరావతిని మొత్తానికి రాజధాని నుంచి తీసేస్తా అంటే టీడీపై వచ్చిన వ్యతిరేకతే వైసీపీ కి వస్తుంది.  ఇప్పటికే కొన్ని ప్రాంతాల వాళ్లు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యమాలు చేస్తున్నారు.

దీనిని తప్పుదోవ పట్టించేలా అమరావతి అతిపెద్ద కుంభకోణం అంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు ప్రసంగాలు చేశారు.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు అంశంపై  అసెంబ్లీ లో జరిగిన స్వల్పకాలిక చర్చలో రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు.  రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కారు చేసిన మోసాలు విస్తుగొలుపుతున్నాయని పేర్కొన్నారు. అధికార రహస్యాలను బయటపెట్టమని ప్రమాణం చేసిన నాటి మంత్రులు ప్రజలకు ఇంత అన్యాయం చేయడం దారుణమన్నారు.  రాజధాని విషయంలో టీడీపీ ఏనాడు పద్ధతిగా వ్యవహరించలేదని విమర్శించారు.

ఇదే చర్చలో ఎమ్మెల్యేలు నాని, వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు కూడా మాట్లాడారు. ఇటీవల అమరావతి కి అన్యాయం చేశారని వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన చేతే అమరావతి కుంభకోణం అని చెప్పించడం కొసమెరుపు. ఒకవేళ  అమరావతి కుంభకోణం అయితే దర్యాప్తు చేయించి నిందితుల్ని జైలులో పెట్టాలి. కానీ ఇదే కారణంగా రాజధాని మార్చుతాం అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: