మోడీ అలా.. జగన్ ఇలా.. ఇద్దరూ ఇద్దరే?
ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం ద్వారా ఎంతో మంది లబ్ధిదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. కాబట్టి ఈ పథకం ద్వారాా వైసీపీ ప్రభుత్వానికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృద్ధులకు ఎలాగో పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి జగన్ సర్కారు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో రైల్వేలో ఉన్న 50 శాతం రాయితీని ఎత్తి వేసింది. దీనిపై ప్రధాని మోదీపై అనేక విమర్శలు వచ్చాయి. పేద వారు ఎక్కువగా ప్రయాణించే రైళ్లలో ఇలా వృద్ధులకు ఉన్న రాయితీలను తీసేయడం సరైనది కాదని చెప్పారు. అయినా వినకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైళ్లో రాయితీలను ఎత్తేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే వృద్ధులకు అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే వారు ఎక్కువ ప్రయాణాలు చేయాలని అనుకోరు. చాలా పరిమితమైన ప్రయాణాలు మాత్రమే చేస్తారు. అలాంటి సమయంలో ఆర్టీసీకి పెద్దగా భారం ఉండకపోవచ్చు. ముఖ్యంగా కేంద్రంలో రాయితీ ఎత్తివేసిన తర్వాత ఆంధ్రలో రాయితీలు ఇవ్వడం వల్ల చాలా వరకు ప్రజలకు ప్రభుత్వం సానుభూతి కలిగే అవకాశం ఉంది. ఇలాంటి పథకాలను మరిన్ని ప్రవేశపెట్టిన ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మొత్తం మీద వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి అనుకూలంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహ అక్కర్లేదు.