తిరుమల చిరుతల కట్టడికి కర్రలే కరెక్టా?

Chakravarthi Kalyan
తిరుమలలో చిరుతల సంచారం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే బాలుడిని చిరుత ఎత్తుకెళ్లి చంపిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చిరుతలను బంధించేందుకు నిర్ణయం తీసుకుంది. తిరుమల నడక దారి మార్గంలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఎక్కడైతే బాలుడిని చంపిందో ఆ ప్రాంతంలో బోను ఏర్పాటు చేయడంతో మరుసటి రోజే చిరుత చిక్కింది.

ఇలా చిరుత బోనులో చిక్కడంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే మరో అసలు సమస్య మొదలైంది. అటవీ శాఖ అధికారులు మరో బోను ఏర్పాటు చేయగా ఇంకో చిరుత కూడా చిక్కింది. ఇలా నడక మార్గంలో ఇప్పటి వరకు మొత్తం ఆరు చిరుతలు బోనులో పడటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆరో చిరుత నడక మార్గంలో ఉంచిన బోను లో చిక్కడంతో దాన్ని అటవీ శాఖ అధికారులు తీసుకెళ్లి డీప్ ఫారెస్ట్ లో విడిచిపెట్టారు.

చాలా మంది చిక్కిన చిరుతలను జూలో ఉంచాాల్సింది పోయి అడవిలో విడిచిపెట్టడం ఏంటని అడుగుతున్నారు. అయితే అడవిలో విడిచిపెట్టడమే సరైన మార్గం. లేకపోతే చట్టం ప్రకారం అటవీ శాఖ అధికారులపై కేసులు పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో తిరుమల కాలి నడక ప్రాంతంలో కంచె ఏర్పాటు  చేయాలని చాలా మంది అడుగుతున్నారు. కానీ దీనికి అటవీ శాఖ రూల్స్ ఒప్పుకోవు. అంత పెద్ద అడవిలో తిరుమల నడక మార్గంలో అటు ఇటు కంచె ఏర్పాటు చేస్తే అటవీ జంతువుల సంచారం ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు.

దీని వల్ల అటవీ జంతువులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి రూల్స్ అడ్డు పడుతున్నాయి. చిరుత నుంచి రక్షణకు టీటీడీ కర్రలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై కూడాా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. పోనీ ఏదైనా సలహా ఇస్తారేమోనంటే అది ఇవ్వరు. కానీ చేస్తున్న పనుల గురించి ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: