రాధాకృష్ణ కొత్త పలుకు.. జగన్‌పైనే విషం చిలుకు?
ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆయన్ని విమర్శిస్తూ ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ఆయన గురించి పొగుడుతూ రాయడం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా ఇలానే ప్రవర్తించారన్న వాదన ఉంది. ఇప్పుడు జగన్ విషయంలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. ఈ కేసుకు చంద్రబాబుకు ఏం సంబంధం లేదన్నట్లుగా కొత్తపలుకులో రాధాకృష్ణ చెప్పుకొస్తున్నారు.
కొత్త పలుకులో కొన్ని విషయాలను పరిశీలిస్తే జగన్ చంద్రబాబును అరెస్టు చేసి మానసిక ఆనందం పొందగలడేమో కానీ వ్యవస్థల్ని దెబ్బతీయలేడన్న విషయం గుర్తించుకోవాలని చెప్పారు. మరి జగన్ అరెస్టయి జైల్లో ఉన్నప్పుడు సోనియా, చంద్రబాబు గురించి ఇలా ఎందుకు రాయలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నైపుణ్యాభివృద్ధి శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖ ద్వారా నిధులు ఏర్పాటు చేశారు. వాటి నిధుల విడుదలలో చంద్రబాబుకు ఎలాంటి లింక్ ఉంటుందని రాధాకృష్ణ అంటున్నారు.
అధికారులు నిధులు విడుదల చేస్తారు. వాటిని ఆయా కంపెనీలతో ఒప్పందం చేయిస్తారని రాసుకొచ్చారు. అలాంటప్పుడు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం ఉండదని చెబుతున్నారు. మరి జగన్ కంపెనీల్లో కూడా జగన్ డైరెక్టుగా ఇన్ వాల్వ్ కాడు. ఈ విషయాన్ని మరిచిపోయి.. జగన్ దొంగ అని ఎలా ప్రశ్నించారని వైసీపీ నేతలు అంటున్నారు. దీని వెనక ఉన్న అంతరార్థం ప్రజలు అర్థం చేసుకోకుండా ఉంటారని భ్రమలో ఉండటం రాధాకృష్ణకే చెల్లిందంటున్నారు. నైపుణ్యాభివృద్ధి శాఖలో జరిగిన అవినీతికి ఆ శాఖ అధికారులదే బాధ్యత కానీముఖ్యమంత్రిది ఎలా అవుతుందని కొత్తపలుకులో వ్యాఖ్యానిస్తున్నారు. మరి అందరి విషయంలో ఇలా ఎందుకు రాయరని రాష్ట్రంలోని చాలామంది ఆర్కేను ప్రశ్నిస్తున్నారు.