జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తున్న టీడీపీ?
ఇదే సమయంలో టీడీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చంద్రబాబు అరెస్టుపై స్పందించని వారందరినీ తిడుతున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. పత్రికల్లోనే పీవీ రమేశ్, కన్విల్కర్ ప్రకటనలు ఇస్తున్నారు. కన్విల్కర్ నిందితుడు. అతను ఇచ్చే నివేదికను ఎవరూ విశ్వసిస్తారు. కానీ వీరిద్దరి నివేదికల ఆధారంగా సీఐడీ అధికారులు బాబు బెయిల్ విషయంలో వాదించే అవకాశం ఉంది.
నిందితుడిగా ఉన్న కన్విల్కర్ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. భవిష్యత్తులో బాబు ఇలా చేసేందుకు అవకాశం ఉంది సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వాదిస్తే.. బాబుకు బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతోపాటు స్కిల్ డెవలప్ మెంట్ లో అసలు అవినీతి జరగడానికి అవకాశమే లేదు అని ఎల్లో మీడియా పత్రికలు వరుస కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ రెండు పత్రికల్లో వచ్చే కథనాల్లోను వ్యత్యాసం ఉంటుంది. ప్రజలు ఈ రెండు పత్రికలను పోల్చి చూసినప్పుడు వాస్తవమేమో అందుకే ఇది కప్పి పుచ్చుకునేందుకు ఇలా రాస్తున్నారు అనే భావన కలగకమానదు.
వీటిని ఖండిస్తూ సాక్షి సైతం స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగింది అంటూ కథనాలు ప్రచురిస్తోంది. ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకోలేక ప్రజలు సతమతమవుతున్నారు. ఈ సందర్భంలోనే టీడీపీ నేతలు సంయమనం పాటించి ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే చంద్రబాబు తప్పు చేశాడనే భావన ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అరెస్టుని ఖండించని వారిని నిందించడం మాని బాబు బయటకు వచ్చేందుకు మార్గాలు ఆలోచించాలి. చంద్రబాబు అరెస్టుపై ఉన్న సానుభూతిని ఓటు బ్యాంకుగా మలచుకోవాలి.