పవన్ సినిమాల సునామీ.. కాసులు కురిపిస్తాయా?
ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరహర వీరమల్లు అని మూడు సినిమాలు రాబోతున్నాయి. వీటికి సంబంధించిన టీజర్లు విడుదలయ్యాయి. వీటి ప్రోమోలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు ఒక్కోటి రెండు నెలలకు ఒకటి వచ్చినా పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే. ఇవే కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరోక సినిమా కూడా రానుంది. రామ్ తాళ్లూరి దీన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్టు పనులు నడుస్తున్నాయి. దీనికి వక్కంతం వంశీ కథను సమకూరుస్తున్నారు. మూడు షూటింగ్ లో ఉన్నాయి. నాలుగోది ఇంకా స్క్రిప్టు రెడీ అవుతోంది.
రాబోయే ఎన్నికల నాటికి ఈ సినిమాలు పూర్తి చేసి తన పార్టీకి ఎన్నికల ప్రచారానికి ఆదాయాన్ని సమకూర్చుకోవడమే పవన్ కల్యాణ్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఆయన వరుస బెట్టి సినిమాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్న తరుణంలో సినిమాలు కూడా చేస్తూ పవన్ బిజీగా గడపనున్నారు. ఈసారి ఎలాగైన తను గెలవాలని తనను నమ్ముకున్న వారిని గెలిపించాలని కూడా కోరుతున్నారు.
ముఖ్యంగా పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాటు జరిగిందో వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలని అనుకుంటున్నారు. అభిమానుల ఓట్లు కూడా అస్సలు వేరే పార్టీలకు పడకుండా ఈసారి జాగ్రత్త పడాలని వ్యుహరచన చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అభిమానులు భారీగా సభలకు తరలివచ్చినా చివరకు ఓట్లు పడకపోవడంతో నిరాశ చెందారు. జనసేన దారుణమైన ఓటమిని చవిచూడడంతో ఈసారి కచ్చితంగా గెలవాలని నిర్ణయించుకున్నారు.