కొత్త పంచాయతీ: అక్కడ బీజేపీ వర్సెస్ వీహెచ్పీ?
అయితే శోభాయాత్ర సందర్భంగా కావాలనే కొంతమంది దుండగులు రాళ్లు, కర్రలతో దాడులు చేశారని తెలిసింది. తదనంతరం ఆ చర్యలకు వ్యతిరేకంగా హర్యానా ప్రభుత్వం బుల్డోజర్లతో చాలా దుకాణ సముదాయాలను కూల్చి వేసింది. ఎవరెవరైతే దాడుల్లో పాల్గొన్నారో.. వారందరికీ సంబంధించిన దుకాణాలను, ఇళ్లను బుల్డోజర్లతో కూల్చి వేశారు. ఇలా కూల్చి వేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో కేసు వేయడంతో కూల్చి వేతలు ఆగాయి.
అయితే శోభాయాత్రను మళ్లీ నిర్వహించాలని వీహెచ్ పీ ప్రభుత్వాన్ని కోరితే దానికి హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీనికి నిరాకరించింది. పరిమితమైన సంఖ్యలోనే శోభాయాత్ర నిర్వహించాలని అనుమతినిచ్చింది. వీహెచ్ పీకి సంబంధించిన 100 మంది సాధువులు మాత్రమే శోభాయాత్ర చేసి ఆలయంలో అభిషేకం నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో హర్యానా బీజేపీ ప్రభుత్వంపై వీహెచ్ పీ నేతలు మండి పడుతున్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తేనే బీజేపీ ప్రశ్నించింది. దీని వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చింది.
అలాంటిది అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు హిందువులు శోభాయాత్ర చేసుకుంటామని అంటే అడ్డుకోవడం దారుణమని వీహెచ్ పీ వాదిస్తోంది. కాంగ్రెస్ కు బీజేపీకి తేడా ఏముందని ప్రశ్నిస్తోంది. కానీ హర్యానా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న ఈ సమయంలో మళ్లీ విద్వేషాలకు తావు ఉండకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా వీహెచ్ పీ మాత్రం బీజేపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది.