పవన్, జగన్.. ఎర్రమట్టి దిబ్బల రాజకీయం?
చంద్రబాబు ప్రతి పాటకు పవన్ జై కొట్టడం అలవాటై పోయిందని సాక్షి పత్రికలో రాసుకొచ్చారు. ఎర్రమట్టి దిబ్బలపై ఇద్దరు గేమ్ ఆడుతున్నారని తెలిపింది. భౌగోళికంగా చాలా ప్రాచీనమైన ఎర్రమట్టి దిబ్బలను కాపాడుతూ.. వాటిని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు చూస్తూ చంద్రబాబు, పవన్ కళ్లు మండిపోతున్నాయి. ఎర్రమట్టి దిబ్బలకు ఇబ్బంది కలగకుండా బఫర్ జోన్ ఏర్పాటు వల్ల వాటికి ఎలాంటి నష్టం ఉండదని తెలిసినా కావాలనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడింది.
అసలు ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న కొత్త వలసలో భూసేకరణ చేపట్టింది చంద్రబాబు సర్కారు హయాంలోనే అని తెలిపింది. ప్రజలను పక్కదోవ పట్టించాలని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. దశాబ్దాలుగా జీడి తోటలను సాగు చేసుకుంటున్న రైతులకు ఢీ పట్టాలు ఎలా ఇస్తుందనే కనీసం అవగాహన జనసేన, టీడీపీ నాయకులకు లేదు. టీడీపీ కి చెందిన రైతులు ఆ పార్టీ నాయకులనే విమర్శిస్తున్నారు. ప్రభుత్వం పరిహారం ఇస్తుంటే రాకుండా అడ్డుకుంటున్నారు.
సర్వే నెంబర్ 49 లో నేరేళ్ల వలస అనే గ్రామం ఉంది. సర్వే నెంబర్ 41 లో 1067 ఎకరాలు ఉంది. 500 ఎకరాల్లో ఐఎన్ ఎస్ కళింగ విస్తరించి ఉంది. మరో 200 ఎకరాలు బిల్డింగ్ సొసైటీకి చెందినది. ఈ రెండింటి మధ్యన 267 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ఎర్రమట్టి దిబ్బల్ని జియో హెరిటెజ్ సైట్ గా గుర్తించారు. నేరేళ్ల వలసను ఆనుకుని ఉన్న సుమారు 80 ఎకరాల్లో గతంలో పట్టాలిచ్చిందని ఈ ప్రాంతంలోనే ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.