పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?
దాదాపు 2.4 బిలియన్ డాలర్లు అప్పు ఇచ్చేందుకు మళ్లీ చైనా అంగీకారం తెలిపింది. దీంతో షాదాబ్ షరీఫ్ ప్రభుత్వానికి ఊరట కలిగించిన విషయం ఇదేనని తెలుస్తోంది. చివర్లో డబ్బులు మిగిల్చుకుని రాజకీయాల్లో ఖర్చు పెట్టుకోవడానికి కూడా షాబాద్ పార్టీకి పనికొస్తుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న ఈ తరుణంలో చైనా పాక్ కు అండగా నిలవడం వెనక ఏదో పెద్ద కుట్రే దాగి ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే పాకిస్థాన్ చైనాకు భారీ మొత్తంలో అప్పులు ఇవ్వాల్సి ఉంది. కానీ అవేవీ పట్టించుకోకుండా పాక్ కు చైనా మళ్లీ భారీ మొత్తంలో సాయం చేయడానికి ముందుకు వస్తోంది. అంతే కాకుండా గతంలో చెల్లించాల్సిన అప్పును కూాడా రెండేళ్ల పాటు ఇవ్వకున్నా పరవాలేదని చెప్పడంతో పాక్ కు అతి పెద్ద సాయం చేసినట్లయింది.
పాక్ కు ఎప్పుడు దోస్తీగా ఉండే దేశాలైన అరబ్ కంట్రీలు మొఖం చాటేసిన తరుణంలో చైనా మాత్రం పెద్ద మనసును చాటుకుంటోంది. అయితే దీని వెనక ఇండియాను దెబ్బకొట్టే ప్లాన్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియా, పాక్ కు ఏ మాత్రం పడవు. ఇలాంటి తరుణంలో పాక్ ను పెంచి పోషిస్తేనే ఇండియాను ఎలాగైనా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఆదుకోవచ్చని తెలుస్తోంది.