ఆడాళ్ల జోరు పెరింది.. ఇక అబ్బాయిలు వంటింటికే?

Chakravarthi Kalyan
మహిళలు ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చదువుకుని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ వ్యవస్థలో 50 శాతానికి పైగా మహిళలే అందుకుంటున్నారని విషయం బయట పడింది. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.


పురుషులతో సమానంగా రాణిస్తూనే కార్పొరేట్ రంగ సంస్థల్లో 50 శాతానికి కంటే పైగా మహిళలు చేరిపోయారని హెర్కీ అనే సంస్థ చేసిన సర్వే లో వెల్లడైంది. 2022-23 సంవత్సరానికి సర్వే ను విడుదల చేసింది. 300 కంపెనీల డాటాను పరిశీలించింది. 22 లో మహిళలకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేసింది. ఈ విధానాన్ని అమలు చేసిన కంపెనీలు 2021 లో 47 శాతం ఉన్నాయి.  2007లో మాత్రం ఇలా ప్రసూతి సెలవులు తీసుకునే మహిళలను 3 శాతం మాత్రమే ఆయా కంపెనీలకు తీసుకునేది. టోటల్ గా చూస్తే  2021 కంటే 2022 సంవత్సరానికి మహిళల ప్రాతినిధ్యం పెరిగింది.


2021 లో మహిళలు 33 శాతం మంది మాత్రమే పని చేసే వారు. కానీ ప్రస్తుతం 2022 వచ్చే సరికి 50 శాతం కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సర్వే లో తేలింది. 2021 తో పోల్చితే మహిళలు దాదాపు 17 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. దాదాపు ఆయా కంపెనీల్లో నాయకత్వ స్థానాల్లో 37 శాతం మంది నియమితులు కావడం విశేషం.


మిడ్ మేనేజ్ మెంట్ నుంచి సీనియర్ లీడర్ల వరకు మహిళల నియామకంలో గణనీయ మైన పెరుగుదల చోటు చేసుకుంది. దాదాపు ఈ అంశంలో కూడా దాదాపు 13 శాతం మెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే నిర్వహించిన నాటికి 91 శాతం పెద్ద కంపెనీలు 90 శాతం చిన్న కంపెనీలు తాము అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాయని తెలిపారు.  ఇకపై దీంతో అబ్బాయిలు వంట పని చేసేందుకు సిద్ధం అవాల్సిందేనని జోక్ లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: